విలువ, మర్యాద అనేది సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి మాత్రమే దక్కుతుంది.ప్రతి చోటా రెస్పెక్ట్, వాల్యూ దొరకాలంటే ఒక్కసారి సక్సెస్ అయితే సరిపోదు ఎప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉండాలి.
వరుసగా ఫెయిల్ అవుతుంటే అంతకుముందు సాధించిన విజయాలను ఎవరు గుర్తుపెట్టుకోకుండా చాలా చీప్ గా చూస్తుంటారు.ఫిలిం ఇండస్ట్రీ అందుకు మినహాయింపేమీ కాదు.
మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ల వద్దకు హీరోలు క్యూ కడుతుంటారు అదే అతను ఒక ఫ్లాప్ తీస్తే చాలు అతని వైపు చూడటమే మానేస్తారు.
అయితే అందరి హీరోలు ఇలా ఉంటారని కాదు.
కొంతమంది ఒకరి ప్రతిభను నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చి తమ మంచి మనసులు చాటుకుంటారు.అలాంటి వాటిలో జూ.ఎన్టీఆర్ ( Jr NTR ) ముందు వరుసలో ఉంటాడు.ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న చాలామంది డైరెక్టర్లకు తారక్ ఛాన్స్ ఇచ్చాడు.వారెవరో చూద్దాం.
• వంశీ పైడిపల్లి
వంశీ పైడిపల్లి( Vamshi Paidipally ) “మున్నా” సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు ఈ మూవీ ఒక మోస్తారు హిట్ తో సరిపెట్టుకుంది.దీని తర్వాత కూడా ఆయన పెద్దగా హిట్స్ కొట్టలేదు అయినా తారక్ ఈ దర్శకుడికి ఒక ఛాన్స్ ఇచ్చాడు.అదే “బృందావనం”( Brundavanam ) మూవీ.ఏ మూవీ సూపర్ హిట్ అయింది.
• మెహర్ రమేష్
మెహర్ రమేష్,( Mehar Ramesh ) తారక్ కాంబోలో “కంత్రి” సినిమా సినిమా వచ్చి ఫ్లాప్ అయ్యింది.దీని తర్వాత కూడా ఆ దర్శకుడికి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చాడు.ఆ అవకాశం ఉపయోగించుకుంటూ మెహర్ “శక్తి” సినిమా( Shakti Movie ) తీశారు కానీ అది కూడా డిజాస్టర్ అయింది.
• పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్( Puri Jagannath ) ఒకానొక సమయంలో రోమియో, హర్ట్ ఎటాక్ వంటి బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్స్‌తో ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు.అలాంటి ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో “టెంపర్” సినిమా ( Temper Movie ) చేయడానికి ఒప్పుకుని తారక్ ఆశ్చర్యపరిచాడు.ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
• సుకుమార్
1: నేనొక్కడినే సినిమా ఫెయిల్ కావడం సుకుమార్కి ఒక పెద్ద ఎదుట లాగా తగిలింది.ఇంత పెద్ద ఫెయిల్యూర్ ఉన్నా తారక్ సుక్కుకి ఛాన్స్ ఇచ్చాడు.దాంతో సుకుమార్( Sukumar ) హిట్ మూవీ “నాన్నకు ప్రేమతో” తీసి తారక్ నమ్మకాన్ని నిలబెట్టాడు.
• ఇతర డైరెక్టర్లు
సర్దార్ గబ్బర్ సింగ్‌తో పెద్ద ఫ్లాప్ ఇచ్చిన బాబీ( Bobby ) పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.అయితే తారక్ బాబీపై నమ్మకం ఉంచుతూ అతనితో కలిసి “జై లవ కుశ” సినిమా చేశాడు.అది ఎన్టీఆర్ కెరీర్‌లో చెప్పుకోదగిన హిట్‌గా నిలిచింది.
అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్( Trivikram ) వైపు చూడటమే మానేశారు టాలీవుడ్ హీరోలు కానీ తారక్ “అరవింద సమేత” సినిమాకి ఓకే చెప్పి త్రివిక్రమ్‌కి లైఫ్ ఇచ్చాడు.
కొరటాల శివ( Koratala Shiva ) దేవర సినిమా ద్వారా మరో ఛాన్స్ ఇచ్చాడు తారక్.