గతంలో ప్రజలు ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు.ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరేవి కావు.
కానీ, ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు.ముఖ్యంగా షుగుర్, బీపీ, గుండె జబ్బుల బాధితులు భారీగా పెరిగిపోతున్నారు.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, శరీరక శ్రమ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.ఏదేమైనా ఈ సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటే.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఆకులు సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు ఆకులు ఏంటో తెలుసుకుందాం పదండీ.
వేప ఆకులు. చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఖాళీ కడుపుతో నాలుగైదు వేప ఆకులను నమిలి తింటే.అందులో ఉండే ఔషధ గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
షుగర్ వ్యాధి దరి చేరకుండా అడ్డు కట్ట వేస్తాయి.రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.
రోగ నిరధక వ్యవస్థ బలపడుతుంది.మరియు శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కూడా ఉంటాయి.
తులసి ఆకులు. అనేక వ్యాధులకు ఇది దివ్యౌషధం.
ఉదయాన్నే ఐదారు తులసి ఆకులను నోట్లో వేసుకుని బాగా నమిలి తిని, ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.గుండె పని తీరు మెరుగుపడుతుంది.శరీరంలో మలినాలు బయటకు వెళ్లిపోతాయి.జీర్ణ వ్యవస్థ సైతం చురుగ్గా మారుతుంది.
ఇక మూడొవ ఆకు కరివేపాకు. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల షుగర్, బీపీ, గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.
కంటి చూపు పెరుగుతుంది.జుట్టు సమస్యలు దూరం అవుతాయి.
మరియు వివిధ రకాల చర్మ సమస్యల నుంచి సైతం విముక్తి పొందొచ్చు.