ఏపీలో ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపీ.
టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.పల్నాడులో( Palnadu ) బాంబులు కూడా విసురుకోవటం జరిగింది.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం( CEC ) కలుగజేసుకొని.పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది.
మరి కొంతమంది అధికారులపై బదిలీ వేటువేసి.శాఖపరమైన విచారణకు ఆదేశించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల తరువాత అల్లర్లు జరిగాయి.

ఇదిలా ఉంటే తాజాగా దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై( Chintamaneni Prabhakar ) కేసు నమోదు అయింది.గురువారం పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలియజేశారు.పెదవేగి మండలం( Pedavegi Mandal ) కొప్పులవారి గూడెంలో టీడీపీ.
వైసీపీ గొడవల నేపథ్యంలో రాజేష్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ప్రభాకర్ అక్కడికి వెళ్లి రాజేష్ ను తీసుకెళ్లడం జరిగింది.

దీంతో పోలీసులు చింతమనేని పై కేసు నమోదు చేయడం జరిగింది.దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ ఈసారి గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు.అంతకుముందు రెండుసార్లు దెందులూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.2019 ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.దీంతో 2024 ఎన్నికలలో గెలవడం కోసం తనదైన శైలిలో చింతమనేని ప్రచారం విషయంలో ఇంకా అనేక విషయాలలో ప్రభుత్వంపై పోరాడుతూ కీలకంగా రాణించారు.దెందులూరు తెలుగుదేశం క్యాడర్ సైతం గతంలో కంటే ఈసారి చింతమనేని గెలుపు కోసం గట్టిగా కష్టపడింది.
మరి జూన్ 4వ తారీఖు నాడు వచ్చే ఫలితాలలో చింతమనేని గెలుస్తారో లేదో చూడాలి.