తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కి ఎన్నో గండాలు చుట్టుముట్టినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చారు.
ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.ఇవే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చింది అనడంలో సందేహం లేదు.
వాటిలో ముఖ్యమైనది రైతు రుణమాఫీ .ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ హామీ ఎన్నికల్లో బాగా పనిచేయడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్ళినా, రైతు రుణమాఫీ అంశంపైనే ప్రధానంగా మాట్లాడేవారు.
స్థానికంగా ఉన్న దేవుళ్ళపై ఒట్టేసి మరీ హామీ ఇచ్చారు.అయితే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకే చేశారా .నిజంగానే రైతు రుణమాఫీ అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నారా అనేది ఎవరికి అర్థం కావడం లేదు.వాస్తవంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది .రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే వేలకోట్ల రూపాయలు అవసరం అవుతాయి. దీంతో ఇది సాధ్యమా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.
రేవంత్ తన మాట నిలబెట్టుకోవాలంటే విడతల వారీగా రుణమాఫీ చేస్తారా లేక ఒక్కసారిగానే మొత్తం రుణమాఫీ చేసి సంచలనం సృష్టిస్తారా అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.ఇక ఖజానాకు భారీ ఆదాయాన్ని తీసుకువచ్చి ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ అధికారులతో తరచుగా సమీక్షలు నిర్వహించడం వెనుక కారణం ఇదే అన్న అభిప్రాయాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేయకపోతే విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది .
అలాగే జనాలు కూడా ఈ అంశంపై కాంగ్రెస్ ను, ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఏర్పడబోతోంది.పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో రైతులకు తాము తప్పకుండా రుణ మాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు.ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు సంక్షోభం ఉండబోతోంది అని బిజెపి గట్టిగానే చెబుతోంది.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తర్వాత దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరుతున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్( K Laxman ) వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది .ఏది ఏమైనా రాబోయే మూడు నెలలు కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డి కి కష్టకాలమే అన్నట్టుగా పరిస్థితి ఉంది.