జబర్దస్త్ అవినాష్( Jabardasth Avinash ) గురించి ప్రేక్షకులకు కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అవినాష్ ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో నీతోనే డ్యాన్స్ షోలో( Neethone Dance Show ) డ్యాన్స్ చేస్తున్నారు.
బాల్యం నుంచి నేను హాస్టల్ లో చదువుకున్నానని బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివానని అవినాష్ అన్నారు.నాన్న బాలీవుడ్ లో ప్రొడక్షన్ డ్రైవర్ అని ఆయన కామెంట్లు చేశారు అమితాబ్ ను కూడా నాన్నగారు డ్రాప్ చేయడం జరిగిందని అవినాష్ చెప్పుకొచ్చారు.
బల్కంపేటలో ఉన్న కిరాణాషాపులో నేను పని చేశానని ఆయన తెలిపారు.ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా( Office Boy ) పని చేశానని అవినాష్ కామెంట్లు చేశారు.
ఎగ్జామ్ ఫీజు తప్ప ఫ్యామిలీ మెంబర్స్ ను అడిగేవాడిని కాదని ఆయన అన్నారు.కాలేజ్ కంటే మూవీ ఆఫీస్ ల చుట్టూ ఎక్కువగా తిరిగేవాడినని అవినాష్ వెల్లడించారు.
నేను జబర్దస్త్ టీమ్ లీడర్ గా( Jabardasth Team Leader ) పని చేసిన సమయంలో నాపై నాకు నమ్మకం కలిగిందని అవినాష్ అన్నారు.

నాకు సీనియర్లతో, డైరెక్టర్లతో ఎలా ఉండాలో తెలుసని ఆయన తెలిపారు.నాపై ఎవరైనా రాజకీయాలు చేసినా నాకు తెలిసేదని ఆయన వెల్లడించారు.జబర్దస్త్ బ్రాండ్ తో ఈవెంట్స్ వచ్చేవని ఆయన తెలిపారు.
జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఒక స్కిట్ కు 8 వేల రూపాయలు మిగిలేవని ఆయన చెప్పుకొచ్చారు.ఈవెంట్స్ కోసం విదేశాలకు కూడా వెళ్లానని అవినాష్ కామెంట్లు చేశారు.
చదువుకునే సమయంలో అన్నం వండుకుని ఆవకాయ పచ్చడి బాక్స్ లో కట్టుకుని వెళ్లేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.

దొంగతనంగా గోడ దూకి వెళ్లి థియేటర్ లో కూర్చుని సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయని అవినాష్ అన్నారు.అవినాష్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అవినాష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ ఎదుగుతోంది.