తరుణ్ రీ ఎంట్రీ పై రోజా రమణి షాకింగ్ కామెంట్స్... అలాంటి పని చేస్తున్నారంటూ?

సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు తరుణ్( Tarun ) ఒకరు.నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు అంటే సినిమాలలో నటించి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.

 Roja Ramani Shares Good News To Tarun Re Entry In Industry Details, Tarun,tarun-TeluguStop.com

ఈ సినిమాలో తర్వాత ఈయనకు లవర్ బాయ్( Lover Boy ) అనే ట్యాగ్ కూడా ఇచ్చారు.అయితే తరుణ్ ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా వెలిగారు.

అయితే అనంతరం ఈయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి తరుణ్ రీ ఎంట్రీ( Tarun Re-Entry ) ఇవ్వాలని అభిమానులు కోరుకున్నారు.ఈయన రీఎంట్రీ గురించి ఇదివరకు ఎన్నో వార్తలు వచ్చాయి.స్టార్ హీరో సినిమాలలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని ఖండించారు.

తాజాగా ఈయన తల్లి రోజా రమణి( Roja Ramani ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తరుణ్ రీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రోజా రమణి మాట్లాడుతూ త్వరలోనే తరుణ్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని ఆయన త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిపారు.ప్రస్తుతం తన సినిమా పనులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తామని తెలిపారు.ఇక ప్రస్తుతం ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ప్రస్తుతం తరుణ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలని చూసుకుంటున్నారు అంటూ రోజా రమణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube