టాలీవుడ్ స్టార్ స్టార్ హీరోలు బాలయ్య,( Balakrishna ) రవితేజ ( Ravi Teja ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.కొన్ని సందర్భాల్లో బాలయ్య బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిస్తే మెజారిటీ సందర్భాల్లో రవితేజ బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచారు.
అయితే బాలకృష్ణ, రవితేజ కాంబినేషన్ లో రావాల్సిన ఒక సినిమా మిస్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
బాలయ్య హీరోగా నిప్పురవ్వ( Nippu Ravva Movie ) అనే సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
ఈ సినిమాలోని ఒక పాత్ర కోసం మేకర్స్ రవితేజ పేరును పరిశీలించడం జరిగిందట.అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యం కాలేదని తెలుస్తోంది.
బాలయ్య, రవితేజలకు ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ఉంది.ఈ హీరోలు తలచుకుంటే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టం కాదు.

బాలయ్య, రవితేజలకు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉంది.రవితేజ ఇప్పటికే తను నటించిన పలు సినిమాలను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయగా బాలయ్య భవిష్యత్తు సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా( Pan India Movies ) విడుదల చేస్తానని చెబుతున్నారు.బాలయ్య క్రేజ్, రేంజ్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో మారిపోయాయి.సీనియర్ హీరోలలో బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.

బాలయ్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.బాలయ్య పుట్టినరోజుకు సరిగ్గా 20 రోజుల సమయం మాత్రమే ఉంది.బాలయ్య పుట్టినరోజు కానుకగా మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య రవితేజ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు.బాలయ్య రవితేజలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ఈ హీరోల పారితోషికాలు సైతం భారీ స్థాయిలో ఉన్నాయి.