ట్రూడోకు షాక్.. ఈసారి మత సమూహాల చూపు కన్జర్వేటివ్‌ల వైపే, కెనడాలో సంచలన సర్వే

కెనడాలో( Canada ) వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.దీనికి సంబంధించి అప్పుడే పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.

 Justin Trudeaus Liberal Party Loses Traction Across All Religious Groups In Cana-TeluguStop.com

అలాగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనంటూ ఓపీనియన్ పోల్స్, సర్వేలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.తాజాగా ఓ సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది.

కెనడాలో మెజారిటీ హిందువులు, సిక్కులు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ( Conservative Party ) వైపు నిలుస్తారని సర్వే వెల్లడించింది.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) నేతృత్వంలోని పాలక లిబరల్ పార్టీ అన్ని మత సమూహాలలో పట్టును కోల్పోయినట్లుగా పేర్కొంది.

కన్జర్వేటివ్‌లకు 53 శాతం మంది హిందువులు మద్ధతు తెలుపుతుండగా.ఇది కెనడాలోని సిక్కుల సంఖ్య కంటే ఒకే ఒక్క పాయింట్ తక్కువ.దేశంలో నిర్ణయాత్మక శక్తిగా వున్న కెనడియన్ క్రిస్టియన్, హిందూ, యూదు, సిక్కు ఓటర్లు ఇతర మతపరమైన గుర్తింపు లేని సమూహాల్లో కన్జర్వేటివ్‌లు ముందంజలో వున్నారని సర్వే పేర్కొంది.లాభాపేక్ష లేని , పక్షపాత రహిత ‘Angus Reid Institute ’ (ARI) గురువారం ఈ సర్వేను బహిర్గతం చేసింది.

Telugu Angusreid, Canada, Conservative, Hindus, Justin Trudeau, Liberal, Loses,

ఇదే సమయంలో లిబరల్ పార్టీకి ( Liberal Party ) 22 శాతం మంది హిందువులు, 21 శాతం మంది సిక్కుల మద్ధతు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.గ్రేటర్ టొరంటో ఏరియా, మెట్రో వాంకోవర్, కాల్గరీలలోని ప్రధాన పట్టణ ప్రాంతాలలో గణనీయమైన ఓటింగ్ బ్లాక్‌లను ఏర్పరచుకోవడంతో ఈ కమ్యూనిటీలలో కన్జర్వేటివ్‌లు ఊపందుకున్నారు.వాస్తవానికి రెండు సమూహాలు (హిందూ, సిక్కులు) పెద్ద సంఖ్యలో కన్జర్వేటివ్‌లకు మద్ధతు ఇస్తున్నట్లు సర్వే తెలిపింది.పియరీ పోయిలీవ్రే( Pierre Poilievre ) నేతృత్వంలోని పార్టీకి మొత్తం మీద 43 శాతం మద్ధతు పొందింది.

ఇది లిబరల్స్ కంటే 20 శాతం అధికం.

Telugu Angusreid, Canada, Conservative, Hindus, Justin Trudeau, Liberal, Loses,

గతేడాది అక్టోబర్‌లో మొదలైన ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం( Israel Hamas War ) తర్వాత ట్రూడో ప్రభుత్వం ఈ సంఘర్షణలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించడంతో యూదు, ముస్లిం వర్గాల ఓటర్లను కోల్పోయినట్లుగా కనిపిస్తోంది.ముస్లింలు ఉదారవాదుల కంటే భారత సంతతి నేత జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ)ని ఇష్టపడతారు.కెనడాలోని యూదులు 42 శాతం మద్ధతుతో కన్జర్వేటివ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు.ఇది లిబరల్స్‌తో పోల్చితే 9 శాతం ఎక్కువ.

2021 జనాభా లెక్కల ఆధారంగా.2020లో స్టాటిస్టిక్స్ కెనడా నివేదిక ప్రకారం దేశంలో సుమారు 8,30,000 మంది హిందువులు ఉన్నారు.వారి సంఖ్య గడిచిన 20 ఏళ్లలో రెట్టింపు అయ్యింది.

అలాగే సిక్కుల జనాభా కూడా రెండు దశాబ్ధాలలో గణనీయంగా పెరిగింది.వీరు దాదాపు 7,70,000 మంది ఉంటారని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube