జూనియర్ ఎన్టీఆర్ ల్యాండ్ వివాదం లో అసలు నిజాలు... లోగుట్టు పెరుమాళ్ కి ఎరుక..

జూ.ఎన్టీఆర్( Jr NTR ) ఓ ఇంటి స్థలం వివాదంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 Jr Ntr Land Issue Unknown Facts Details, Jr Ntr, Jr Ntr Land Issue, Sunku Geetha-TeluguStop.com

ఇలాంటి సమస్యలు సామాన్య ప్రజలు తరచుగా ఎదుర్కొంటూనే ఉంటారు సెలబ్రిటీ కాబట్టి ఇది హైలెట్ గా మారింది.ఎన్టీఆర్ 2003లో ఒక రిచెస్ట్ ఏరియాలో 600–700 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు.

ఈ ల్యాండ్ ఇప్పుడు వివాదంలో పడింది.సుంకు గీత( Sunku Geetha ) అనే మహిళ నుంచి తారక్‌ ఆ స్థలాన్ని కొనుగోలు చేశాడు.

కానీ ఆ ల్యాండ్ మీద 1996లోనే బ్యాంకు లోన్స్( Bank Loans ) తీసుకున్నారని సంగతి తెలుసుకోలేకపోయాడు.ఈ భూమిని పూచికత్తుగా చూపిస్తూ సుంకు గీత ఫ్యామిలీ మూడు బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంది.

సాధారణంగా రుణాల్లో ఉన్న భూమిని కొనేటప్పుడు ఆ సంగతి కొనుగోలు చేసే వారికి కచ్చితంగా తెలుస్తుంది.కానీ తారక్ ఈ విషయం తెలుసుకోలేకపోయాడు.

బ్యాంకులు రుణం తీసుకున్న వారికి వెంటనే నోటీసులు కూడా పంపిస్తాయి.అయితే సుంకు గీత ఎగ్గొట్టే ఉద్దేశంతో ఆ నోటీసులను పట్టించుకోలేదు ఏమో.ఎన్టీఆర్ భూమిని కొనుగోలు చేసేటప్పుడు సరిగ్గా వివరాలు, కాగితాలు పరిశీలించి ఉండకపోవచ్చు.లాయర్ కూడా అతనిని పక్కదారి పట్టించి ఉండవచ్చు.

Telugu Jr Ntr, Ntr, Sunku Geetha, Tollywood, Tribunal-Movie

గీత తీసుకున్నారు చెల్లించకుండా ఆచూకీ లేకుండా పరారైంది కట్ చేస్తే బ్యాంకులు ఎన్టీఆర్ కొన్న స్థలం( NTR Land ) తమకే చెందుతుందని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో కేసు ఫైల్ చేశాయి.ఈ లోన్లు మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు భూమి తమకే చెందినట్లుగా సంతకాలు తీసుకుంటాయి.ఆ ఆధారాల కారణంగా ట్రిబ్యునల్ కోర్టు( Tribunal Court ) బ్యాంకులకే స్థలం చెందుతుందని తీర్పు వెలువరించింది.దీంతో తారక్‌కి షాక్ తగిలినట్లు అయింది.న్యాయం కోసం అతను కోర్టు మెట్లు ఎక్కాడు.గీతపై చీటింగ్ కేసు ఫైల్ చేయించాడు.

ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

Telugu Jr Ntr, Ntr, Sunku Geetha, Tollywood, Tribunal-Movie

కోర్టు ట్రిబ్యునల్ తీర్పునే సమర్థించవచ్చు.సో, జూనియర్ ఎన్టీఆర్ న్యాయం కోసం ఏం చేయగలడు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ల్యాండ్ ఒక డిస్‌ప్యూట్‌లో ఉందని ఎన్టీఆర్ కు తెలిసినట్లు ఉంది అందుకే 2013లో వారి వేరే వాళ్ళకి అమ్మేసి చేతులు తెలుపుకున్నాడు కానీ ఇప్పుడు ఎందుకు కోర్టుకు ఎక్కాడు? తాను మోసపోయానని న్యాయం చేయాలని మాత్రమే అతను కోర్టుకు ఎక్కాడు.

Telugu Jr Ntr, Ntr, Sunku Geetha, Tollywood, Tribunal-Movie

ఎందుకంటే అతను ఎవరికీ అయితే అమ్మేశాడో వారు ఈ ప్రాపర్టీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పై కేసు వేయవచ్చు, పంచాయతీ పెట్టొచ్చు.అప్పుడు “నేనే ఇక్కడ ఒక బాధితుడి”ని అని ఆయన చెప్పుకుంటాడు.ఒక బాధితుడు ఇంకొకరిని బాధితుడిని చేయడం తప్పే అవుతుంది.1996 కాలంలో బ్యాంకులు అప్పటి భూమి ధరను బట్టే లోన్స్ ఇచ్చి ఉంటాయి.ఆ లోన్ అమౌంట్ తక్కువే అయి ఉంటుంది కాకపోతే వడ్డీ కొంచెం పెరిగి ఉంటుంది.

వాటిని కట్టడం ద్వారా ఈ ల్యాండ్ ఓనర్‌షిప్‌ను పొందే అవకాశం ఉంటుంది.ల్యాండ్ విలువ ఆ లోన్ల కంటే వందల రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే పనిని తారక్‌ చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube