ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలు వైఎస్ జగన్ కే( YS Jagan ) అనుకూలంగా రాబోతున్నాయని ఇప్పటికే జగన్ కామెంట్ల ద్వారా ఒకింత క్లారిటీ వచ్చేసింది.151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాలను మించి వైసీపీకి విజయం సొంతమవుతుందని జగన్ స్వయంగా వెల్లడించారు.అయితే రాష్ట్రంలో మరోమారు వైసీపీకే( YCP ) అధికారం సొంతమవుతుందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్( First Step Solutions ) అనే సంస్థ తేల్చి చెప్పింది.
ఈ సంస్థ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో వైసీపీ 110 స్థానాలలో కచ్చితంగా విజయం సాధించనుంది.
కూటమి 45 స్థానాల్లో విజయం సాధిస్తుందని 20 స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఉంటుందని ఈ సర్వేలో వెల్లడైంది.ఈ సర్వేలో ఏపీలో వైసీపీ మరోమారు అధికారాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
పోటాపోటీగా ఉన్న 20 స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాల్లో వైసీపీకే ఎడ్జ్ ఉందని పొలిటికల్ వర్గాల భోగట్టా.

ఉమ్మడి శ్రీకాకుళంలో( Srikakulam ) 8 స్థానాలు, ఉమ్మడి విజయనగరంలో( Vizianagaram ) 7 స్థానాలు, ఉమ్మడి విశాఖలో 8 స్థానాలు, ఉమ్మడి తూర్పు గోదావరిలో 8 స్థానాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 5 స్థానాలు, ఉమ్మడి కృష్ణాలో 9 స్థానాలు, ఉమ్మడి గుంటూరులో 7 స్థానాలు, ఉమ్మడి ప్రకాశంలో 6 స్థానాలు, ఉమ్మడి నెల్లూరులో 9 స్థానాలు, ఉమ్మడి చిత్తూరులో 11 స్థానాలు, ఉమ్మడి అనంతపూర్ లో 10 స్థానాలు, ఉమ్మడి కర్నూల్ లో 13 స్థానాలు, ఉమ్మడి కడపలో 9 స్థానాల్లో వైసీపీ విజయం సాధించనుంది.

సీమ జిల్లాల్లోని 6 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండగా సీమలో కేవలం 3 స్థానాల్లో మాత్రమే కూటమి విజయం సాధించనుందని ఈ సర్వే చెబుతోంది.ఈ సర్వే ఫలితాలు( Survey Result ) ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఫలితాలు కావడం గమనార్హం.కూటమి నేతలకు ఎన్నికల ఫలితాలకు ముందే దెబ్బ మీద దెబ్బ తగులుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కూటమి నేతలు ఈ సర్వే ఫలితాల గురించి రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.