భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్,( UK PM Rishi Sunak ) ఆయన సతీమణి అక్షతా మూర్తి( Akshata Murty ) మరింత సంపన్నులయ్యారు.శుక్రవారం విడుదలైన సండే టైమ్స్ వార్షిక సంపన్నుల జాబితాలో( Sunday Times Rich List ) ఈ దంపతులు తమ ర్యాంకును మరింత మెరుగుపరచుకున్నారు.651 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో రూ.6,873 కోట్లు) సంపదతో లిస్ట్‌లో 245వ స్థానానికి చేరుకున్నారు.2022-23 ఆర్ధిక సంవత్సరంలో రిషి సునాక్ దాదాపు 2.2 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో రూ.23 కోట్లు) సంపాదించగా.ఆయన భార్య అక్షతా మూర్తి డివిడెండ్ల రూపంలో 13 మిలియన్ పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.137 కోట్లు) అందుకున్నారు.
రిషి దంపతుల ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో( Infosys ) ఉన్న షేర్ల ద్వారా వచ్చినదే.2023లో ఈ జంట సంపద 529 మిలియన్ పౌండ్లుగా వుండగా… ఇప్పుడది 651 మిలియన్ పౌండ్లకు చేరింది.అంతేకాదు .ఈ సంపదతో కింగ్ చార్లెస్ IIIనే( King Charles III ) వారు మించిపోయారు.సంపన్నుల జాబితాలో రిషి సునాక్ నిలవడంపై 10 డౌనింగ్ స్ట్రీట్ నిరాకరించింది.
ఇది పూర్తిగా ప్రైవేట్ కుటుంబ విషయమని వ్యాఖ్యానించింది.

కాగా.సండే టైమ్స్ వార్షిక జాబితా బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య వరుసగా రెండో ఏడాది పడిపోయిందని తెలిపింది.యూకేలో( UK ) 2022లో 177 మంది బిలియననీర్లు ఉండగా.
గతేడాది ఈ సంఖ్య 171కి పడిపోయింది.ఈ సంవత్సరం ఏకంగా 165కు పడిపోవడంతో ఆ దేశంలో ఆందోళన మొదలైంది.లిస్ట్‌లో భారత సంతతికి చెందిన గోపీ హిందూజా( Gopi Hinduja ) కుటుంబం 37.2 బిలియన్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచింది.భారత్‌కే చెందిన స్టిల్ దిగ్గజం .లక్ష్మీ మిట్టల్( Lakshmi Mittal ) అతని కుటుంబం 14.92 బిలియన్ల సంపదతో 8వ స్థానంలో నిలవడం విశేషం.

గతంలో యూకేలో జీవన వ్యయ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం పన్నులను పెంచింది.దీంతో ప్రతిపక్షాలు రిషి సునాక్‌పై అప్పట్లో ఆరోపణలు చేశాయి.చెబుతున్న ప్రమాణాలను ప్రధాని పాటించడం లేదని, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్న సమయంలో ఇన్ఫోసిస్ కంపెనీలు రష్యాలో పనిచేస్తుండటంపైనా విమర్శలు చేశాయి.
ఈ కారణంతో రష్యాలోని ఇన్ఫోసిస్ కార్యాలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే.