అల్లరి మూకల దాడులు .. కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్ధులకు కేంద్రం హెచ్చరికలు

కిర్గిస్థాన్‌లో( Kyrgyzstan ) చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులకు( Indian Students ) కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఆ దేశ రాజధాని నగరం బిషెక్‌లోని( Bishkek ) విదేశీ విద్యార్ధులే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు తెగబడటంతో భారత ప్రభుత్వం తక్షణం స్పందించింది.

 Indian Students In Kyrgyzstan Asked To Stay Indoors After Mob Violence Details,-TeluguStop.com

విద్యార్ధులెవరూ బయటకు రావొద్దని.కిర్గిస్థాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఎక్స్‌లో అడ్వైజరీ జారీ చేసింది.

పరిస్ధితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ.బయటకు మాత్రం రావొద్దని, ఏదైనా సమస్య ఉంటే తక్షణం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

అలాగే హెల్ప్‌లైన్ నెంబర్ – 0555710041ను షేర్ చేసింది.కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( Foreign Minister S Jaishankar ) సైతం ఈ ఘటనపై స్పందించారు.

భారతీయ విద్యార్ధుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.

కిర్గిస్థాన్ , ఈజిప్ట్‌కు చెందిన విద్యార్ధుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతోనే దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.

ఆ తర్వాత కొద్దిగంటల్లోనే అల్లరి మూకలు రాజధాని బిషెక్‌లోని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ విద్యార్ధులు బస చేస్తున్న హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి.ఈ నేపథ్యంలో ఖ్వాజీ మిలటరీ ఫోర్స్ .ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్( International University Of Kyrgyzstan ) చుట్టూ మోహరించి పలువురిని అరెస్ట్ చేసింది.

Telugu Indianconsulate, Indian, Kyrgyzstan, Kyrgyzstanmob, Mob Violence, Shehbaz

మరోవైపు.అల్లరి మూకల దాడిలో పలువురు పాకిస్తానీ విద్యార్ధులు గాయపడటంతో పాటు ముగ్గురు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే పాక్ ప్రభుత్వం దీనిని ధ్రువీకరించలేదు.

ఈ ఘటనపై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పందించారు.విద్యార్ధులపై దాడులు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని.

ప్రధాని షెహబాజ్ షరీఫ్( Shehbaz Sharif ) కూడా అల్లర్లపై విచారం వ్యక్తం చేసినట్లుగా ఇషాక్ చెప్పారు.బిషెక్‌లోని పాకిస్తాన్ రాయబారి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.

Telugu Indianconsulate, Indian, Kyrgyzstan, Kyrgyzstanmob, Mob Violence, Shehbaz

మే 13న ఇంటర్నేషనల్ యూనివర్సిటీ హాస్టల్‌లో విదేశీయులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది.విద్యార్ధులు తమ స్వదేశాలకు అక్రమాల కోసం ఆశ్రయం ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 29 మంది గాయపడగా. ముగ్గురు ఈజిప్షియన్లను నిర్బంధించారు.ఈ అల్లర్లలో పలువురు విదేశీ విద్యార్ధులు అదృశ్యమవ్వడంతో అధికారులు వారిని కనిపెట్టే పనిలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube