వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది అంటూ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు..!!

ఉండి కూటమి అభ్యర్థి తెలుగుదేశం నేత ఎంపీ రఘురామకృష్ణరాజు( Raghuramakrishna Raju ) ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ పార్టీకి( YCP ) ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.

 Raghuramakrishna Raju Sensational Comments Saying That Ycp Is Afraid Of Defeat D-TeluguStop.com

అది సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కళ్ళల్లో కనబడుతుందని చెప్పుకొచ్చారు.ఓటమి భయంతోనే పల్నాడు, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాలలో వైసీపీ పార్టీకి చెందిన వారు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఏపీలో జరిగిన ఎన్నికలలో కూటమికి 130 కి పైగా సీట్లు వస్తాయని తాను ఇంతకుముందే చెప్పినట్లు… ఆ సంఖ్య ఇప్పుడు 150 సీట్లు దాటిన ఆశ్చర్యపడక్కర్లేదని వ్యాఖ్యానించారు.

Telugu Ap, Ysjagan, Ysrcp-Latest News - Telugu

గతంలో జగన్ కూ ( Jagan ) 110 వస్తాయనుకుంటే 151 వచ్చాయని… దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని.అన్నారు.2019 ఎన్నికలలో వచ్చిన మెజార్టీ జగన్ కూడా ఊహించలేకపోయారని స్పష్టం చేశారు.ఉద్యోగుల ఓటింగ్ శాతం 85% పడిందని చెబుతున్నారని అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని.రఘురామరాజు వ్యాఖ్యానించారు.ఆఖరికి పులివెందులే( Pulivendula ) టైట్ గా ఉందంటే ఇక ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని మీడియాతో స్పష్టం చేశారు.చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోలవర్తి నానిపై దాడిని ఖండించారు.

నానిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Telugu Ap, Ysjagan, Ysrcp-Latest News - Telugu

ఏపీ ఎన్నికలలో( AP Elections ) గెలుపు విషయంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు.గురువారం ఐప్యాక్ టీంతో జగన్ విజయవాడలో భేటీ అయ్యారు.వాళ్ల కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ 2019 కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలవబోతున్నట్లు చెప్పుకొచ్చారు.మరోపక్క కూటమి సభ్యులు సైతం గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు.

మరి జూన్ 4వ తారీఖు వెలువడే ఫలితాలలో ఎవరు అధికారంలోకి వస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube