సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు..!!

శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలవటం సంచలనంగా మారింది.ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,( Alleti Maheshwar Reddy ) ఎమ్మెల్యేలు రామారావు పటేల్,( MLA Ramarao Patel ) పైడి రాకేష్ రెడ్డిలు( MLA Paidi Rakesh Reddy ) ఉన్నారు.

 Bjp Mlas Met Cm Revanth Reddy Details, Cm Revanth Reddy, Bjp Mlas, Alleti Mahesh-TeluguStop.com

రైతు సమస్యలు అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ క్రమంలో కాలేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై చర్చించటం జరిగిందంట.

వాస్తవానికి ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం( Cabinet Meeting ) నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు.కానీ ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు.ఒకవైపు లోక్ సభ ఎన్నికల కోడ్, మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.క్యాబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం నిరాకరించింది.ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘం పేర్కొంది.మే 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టపద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది.

జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల కోడ్ ముగియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube