అంతఃపురం మూవీ గురించి మీకు తెలియని విషయాలు

కృష్ణ వంశీ సినిమాలు అంటేనే కొత్త‌ద‌నంతో నిండి ఉంటాయి.క‌థ ఎలాంటిదైనా ప్రేక్ష‌కుల మ‌దిని తాకేలా తెర‌కెక్కిస్తాడు ఈ ద‌ర్శ‌కుడు.

 Unknown Facts About Anthapuram Movie, Anthapuram Movie, Jagapathi Babu, Sai Kuma-TeluguStop.com

ఆయ‌న సినిమాల్లో మ‌నిషిలోని ఎమోష‌న్స్ అంద‌రినీ క‌దిలిస్తాయి.చేసిన సినిమాలు త‌క్కువే అయినా.

ఎంతో పేరు పొందారు. కృష్ణ వంశీ రూపొందించిన అద్భుత చిత్రాలు ఎన్నో ఉన్నాయి.

వాటిలో అవార్డుల పంట పండించిన అంతఃపురం చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!


ఆగ‌ష్టు 12, 1998లో అంతఃపురం మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఆనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ మీద జెమిని కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సార‌థ్యంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది.ఈ సినిమాలో హీరో అంటూ ఎవ‌రూ ఉండ‌రు.

క‌థే ఈ సినిమా హీరో.లేడీ ఓరియెంటెడ్ సినిమా ల‌క్షణాలుంటాయి.

రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం ఇందులో ప్ర‌తిబింబిస్తుంది.ఆ త‌ర్వాత వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు ఈ సినిమాతో దారి చూపించాడు కృష్ణ‌వంశీ.

Telugu Anthapuram-Telugu Stop Exclusive Top Stories

ఈ మూవీలో మొద‌ట చెప్పుకోవాల్సింది న‌ర్సింహులు పాత్ర పోషించిన ప్ర‌కాష్ రాజ్ గురించి.34 ఏండ్ల వ‌య‌సున్న ప్ర‌కాష్‌రాజ్ 60 ఏండ్ల ముస‌లివాడి పాత్ర పోషించారు.అంతేకాదు క‌రుడుగ‌ట్టిన ఫ్యాక్ష‌నిస్టుగా త‌న న‌ట‌న‌ను పండించారు.మారిష‌స్ లో పుట్టి పెరిగిన సౌంద‌ర్య.భార‌త్‌కు వ‌చ్చి.ఇక్క‌డ ఎదుర్కొన్న స‌మ‌స్యలు ఏంటి? ఆ స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డింది? ఇందుకోసం ఆమెకు ఎవ‌రు స‌హ‌క‌రించారు? అనేది ఈ సినిమా స్టోరీ.ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల్లో త‌న భ‌ర్త‌ను కోల్పోతుంది సౌంద‌ర్య‌.త‌న ప్రాణాలు, త‌న బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె ప‌డే క‌ష్టాల‌ను అద్భుతంగా తెరకెక్కించారు కృష్ణ వంశీ.త‌న న‌ట‌న‌తో భానుమ‌తి క్యారెక్ట‌ర్‌కు వ‌న్నె తెచ్చింది సౌంద‌ర్య‌.

Telugu Anthapuram-Telugu Stop Exclusive Top Stories

ఈ సినిమాలో మ‌రో ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్ సారాయి వీర్రాజు.పాత్ర నిడివి త‌క్కువే అయినా ఈ క్యారెక్ట‌ర్ అద్భుతంగా చేశారు జ‌గ‌ప‌తిబాబు.గాయం సినిమా త‌ర్వాత‌.అలాంటి చ‌క్క‌టి పాత్ర చేశాడు.ఈ సినిమా కోసం ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు.సుమారు 20 రోజులు ఈ సినిమా కోసం పూర్తి స‌మాయాన్ని కేటాయించాడు.క‌నీసం ఇంటికి కూడా వెళ్ల‌లేదు.

షూటింగ్ స్పాట్‌లోనే ఉండి త‌న క్యారెక్ట‌ర్‌ను ఫినీష్ చేశాడు.అంత క‌ష్ట‌ప‌డ్డాడు కాబ‌ట్టే ఈ చిత్రంలో ఆయ‌న న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి.

ఈ చిత్రంలో సౌంద‌ర్య భ‌ర్త‌గా ప్ర‌కాష్‌రాజ్ కొడుకుగా న‌టించాడు సాయి కుమార్. ఆయ‌న పాత్ర‌కు డైలాగులు చాలా త‌క్కువ‌.ప్ర‌కాష్‌రాజ్ భార్య‌గా శార‌ద న‌టించారు.చాలా కాలం త‌ర్వాత ఆమె ఈ క్యారెక్ట‌ర్ చేసింది.

ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు కొడుకు అరుణ్ కుమార్ కూడా ఈ సినిమాలో న‌టించారు.ఆయ‌న ప్ర‌కాష్‌రాజ్‌కు అనుచ‌రుడిగా ఉన్నాడు.

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌‌య రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఈ సినిమాలోని ప‌లు పాట‌లు ఆల్ టైం హిట్స్‌గా నిలిచాయి.ఈ సినిమాలో పాట‌ల‌న్నీ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి క‌లం నుంచి జాలువారాయి.ఎస్ జాన‌కి పాడిన సూర్యుడి పువ్వా పాట‌కు ఉత్త‌మ గాయనిగా నంది అవార్డు ల‌భించింది.

ఈ సినిమాలో హీరో లేక‌పోయినా భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి.ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా 9 నంది అవార్డుల‌ను అందుకుని వారెవ్వా అనిపించింది.

ఉత్త‌మ న‌టిగా సౌంద‌ర్య స్పెష‌ల్ జ్యూరీ అవార్డు, ఆమెకు డ‌బ్బింగ్ చెప్పిన స‌రిత‌కు ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, బెస్ట్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు, బెస్ట్ స‌పోర్టింగ్ ఆర్టిస్టుగా ప్ర‌కాష్‌రాజ్, ఉత్త‌మ స‌హాయ న‌టిగా తెలంగాణ శ‌కుంత‌ల అవార్డులు అందుకున్నారు.ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను ప్ర‌కాశ్‌రాజ్‌కు జాతీయ అవార్డు సైతం ల‌భించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube