కొడుకు పేరును వెరైటీగా చెప్పేసిన టీమిండియా కెప్టెన్ సతీమణి రితికా సజ్దే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

 Team India Captain's Wife Ritika Sajde Reveals Son's Name To Variety, Rohit, Rit-TeluguStop.com

అనేకమంది క్రికెట్ ఫ్యాన్స్ మదిలో చోటు సొంతం చేసుకున్నాడు.అయితే, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రోహిత్ అక్కడ ఉన్నాడు.ఇప్పటికే తొలి టెస్ట్ లో విజయం సొంతం చేసుకున్న భారత టీం(India team) డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్ టెస్ట్ కోసం సిద్ధమవుతుంది.

అయితే, తాజాగా రోహిత్ శర్మ భార్య రితిక (Rohit Sharma wife Ritika) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక కథనాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది.గత నెలలో రోహిత్ శర్మ రితిక ఇద్దరు కలిసి ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు.నవంబర్ 15న కొడుకుకు రీతిక జన్మనిచ్చినట్టు అందరికీ తెలియజేశారు.ప్రస్తుతం రోహిత్, రితికలకు మొదట కుమార్తె, ఇప్పుడు బాబు ఉన్నారు.ఇక పుట్టినప్పటి నుండి రోహిత్ శర్మ కొడుకు పేరు Rohit Sharma son’s name)ఏమై ఉంటుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూన్నారు.అయితే, తాజాగా రోహిత్ కొడుకు పేరు రితిక సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.ఒక ఫోటోను ట్యాగ్ చేసింది.

అందులో రోహిత్ రితిక కొడుకు పేరును రివీల్ చేసింది.ఆ ఫోటోలో రోహిత్ శర్మ కొడుకు పేరు ‘ఆహాన్’ అని అందరికీ అర్థమవుతుంది.

ప్రస్తుతం రోహిత్ శర్మ భార్య రితిక షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇకపోతే, రోహిత్ దంపతుల ముద్దుల కూతురి పేరు ‘సమైరా’ అని తెలిసిన విషయమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube