ఆ భాషలో ఎప్పటికీ సినిమాలు చెయ్యను... అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) త్వరలోనే పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Allu Arjun Sensational Comments On Acting In Bollywood Movies, Allu Arjun, Bolly-TeluguStop.com

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈయన ఇటీవల ముంబైలో సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా దేవిశ్రీప్రసాద్ గురించి ప్రస్తావనకు వచ్చింది.

Telugu Allu Arjun, Alluarjun, Bollywood, Devi Sri Prasad, Pushpa-Movie

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ తో తాను ఒకరోజు మాట్లాడుతూ నువ్వు ఎందుకు బాలీవుడ్ సినిమాలు చేయలేదని ప్రశ్నించాను.అప్పుడు దేవిశ్రీ ఒకటే మాట అన్నారు నువ్వు వెళ్లి బాలీవుడ్ సినిమాలు చెయ్యి.నీ సినిమాకు నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చెప్పారు.

అయితే తనకు బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చే ఆసక్తి లేదని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపారు.

Telugu Allu Arjun, Alluarjun, Bollywood, Devi Sri Prasad, Pushpa-Movie

ప్రస్తుతమున్న పరిస్థితులలో బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood industry ) కొనసాగడం కష్టమని అందుకే తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయను అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి వారందరూ కూడా హిందీ సినిమాలు చేస్తున్నారు.కానీ అల్లు అర్జున్ మాత్రం చేయనని చెప్పడంతో ఒక్క సారిగా అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు నార్త్ ఇండస్ట్రీలోనే ఎంతో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం పుష్ప 2 కోసం కూడా నార్త్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇలా నార్త్ ఇండియాలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న బన్నీ బాలీవుడ్ సినిమాలు చేయాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube