మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉండడు.ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక సమయంలో పొరపాటు చేయడం సహజమే.
తాజాగా మధ్యప్రదేశ్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.ఒక మహిళ కడుపులో కత్తెర(Scissors in woman’s stomach) ఉన్నట్లు గుర్తించిన వైద్య బృందం ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.

మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో (Bhind, Madhya Pradesh) 44 సంవత్సరాలు గల కమలా బాయి అనే మహిళ రెండు సంవత్సరాల క్రితం గాల్వియార్లోని కమల రాజా హాస్పిటల్ లో ఒక శాస్త్ర చికిత్స చేయించుకుంది.అయితే అప్పటి నుంచి ఆమెకు కడుపులో నొప్పిగా బాధపడుతూ ఉండడం, ఎన్ని మందులు ఉపయోగించినా కానీ ఆ నొప్పి తగ్గకపోవడంతో మరోసారి డాక్టర్లను సంప్రదించడంతో వారు సిటి స్కాన్ చేయాలని నిర్ణయించారు.ఈ క్రమంలో సిటీ స్కాన్ (CT San)చేసిన అనంతరం రిపోర్ట్ లో ఆమె కడుపులో ఒక కత్తెర ఉన్నట్లు గుర్తించారు.
ఇది చూసిన వైద్య సిబ్బందితో సహా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యరు.శస్త్రచికిత్స చేసే సమయంలో వైద్యులు ప్రమాదవశాత్తు ఆమె కడుపులో కత్తెరను(Sciccors) వదిలేసారేమో అని పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇక ఈ క్రమంలో సదరు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.కచ్చితంగా రెండు సంవత్సరాల క్రితం ఆమెకు ఆపరేషన్ చేసిన కమల రాజా హాస్పిటల్(Kamala Raja Hospital) సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ మహిళకు ఇంత నొప్పి వచ్చిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.అయితే, మరోవైపు ఈ సంఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఏర్పాటు చేసే ఉన్నతాధికారులకు తెలియజేస్తామని డిస్టిక్ హాస్పిటల్ వారు తెలియజేశారు.
చూడాలి మరి బాధితురాలకు ఎంతవరకు న్యాయం చేకూరబోతుందో.