సింగపూర్ : యోగా సెంటర్‌లో మహిళలపై వేధింపులు, భారతీయుడిని దోషిగా తేల్చిన కోర్ట్

మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం ఇటీవలి కాలంలో ప్రజలు యోగాను( Yoga ) ఎక్కువగా ఆదరిస్తున్నారు.ఐక్యరాజ్యసమితి కూడా యోగా ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని గ్రహించి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.

 Indian National Found Guilty Of Molesting Women During Yoga Classes In Singapore-TeluguStop.com

అయితే తన వద్ద యోగా శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు మహిళలపై ఓ భారతీయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.ఈ కేసులో అతనిని సింగపూర్ కోర్ట్( Singapore Court ) దోషిగా తేల్చింది.

నిందితుడిని 34 ఏళ్ల రాజ్‌పాల్ సింగ్‌గా( Rajpal Singh ) గుర్తించారు.అతనికి జూలైలో కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.ఇప్పటికే రాజ్‌పాల్ పాస్‌పోర్ట్ జప్తు చేయగా.25 వేల సింగపూర్ డాలర్ల బెయిల్‌పై బయట ఉన్నాడు.

2019, 2020 మధ్యకాలంలో తన యోగా క్లాస్‌లలో ఐదుగురు మహిళల ప్రైవేట్ భాగాలను రాజ్‌పాల్ అసభ్యంగా తాకినట్లుగా ఆరోపణలు వచ్చాయి.అయితే నాల్గో విద్యార్ధిని ఆరోపణలను కోర్ట్ అంగీకరించలేదు.

రాజ్‌పాల్ మొత్తం 10 అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.విచారణలో ఐదవ మహిళకు సంబంధించిన రెండు అభియోగాలను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.

రాజ్‌పాల్ సింగ్ .ఏప్రిల్ 1, 2019 నుంచి టెలోక్ అయర్ స్ట్రీట్‌లోని ట్రస్ట్ యోగాలో( Trust Yoga ) యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.కోర్ట్ గ్యాగ్ ఆర్డర్ కారణంగా ఐదుగురు మహిళల పేర్లు బయటకి వెల్లడించరాదు.

Telugu Indian National, Misbehavior, Rajpal Singh, Singapore, Yoga, Yoga Classes

జూలై 11, 2020న రాజ్‌పాల్ తనపై వేధింపులకు పాల్పడినట్లు ఒక మహిళ ఆరోపించింది.అప్పడు తన వయసు 24 సంవత్సరాలని చెప్పింది.యోగా క్లాస్ ముగిసిన తర్వాత ఏం జరిగిందో, రాజ్‌పాల్ తనతో ఎలా ప్రవర్తించాడో తన మిత్రుడికి వాట్సాప్ ద్వారా తెలిపింది.

డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలీన్ యాప్ సింగ్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.అంతేకాకుండా ఆ సమయంలో ట్రస్ట్‌లో సేల్స్ అసిస్టెంట్ మేనేజర్‌గా వున్న అరవింద్ గణరాజ్‌తోనూ( Aravind Gunaraj ) దీనిపై మాట్లాడింది.

ఆ మరుసటి రోజు ఛాటింగ్ ద్వారా ఒకరికొకరు సంభాషించుకున్నారు.

Telugu Indian National, Misbehavior, Rajpal Singh, Singapore, Yoga, Yoga Classes

అనంతరం జూలై 31, 2020న ఆ మహిళ తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.ఆ వెంటనే 28, 37 ఏళ్లు వున్న మరో ఇద్దరు మహిళలు తొలి బాధితురాలిని సంప్రదించారు.28 ఏళ్ల రెండో బాధితురాలు తన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.నాల్గవ బాధితురాలు 2020 ఆగస్ట్ 25న ట్రస్ట్ యోగాకు సంబంధించి ఆన్‌లైన్ రివ్యూ చూసింది.ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా రెండో బాధితురాలిని సంప్రదించి .తన అనుభవాన్ని పంచుకుంది.తర్వాత రెండవ బాధితురాలు.

ఆమెను తొలి బాధితురాలికి పరిచయం చేసింది.దీని తర్వాత వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాట్లాడుకున్నారు.

కోర్టుకు అందజేసిన పత్రాల ప్రకారం.నలుగురు బాధితులు జూలై, ఆగస్ట్ 2020లలో వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube