ఏపీలో పోలింగ్( AP Polling ) అనంతరం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే.ఈ ఘటనాలపై కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) సీరియస్ అయింది.
ఏపీలో అల్లర్లు ఎందుకు అదుపు చేయలేకపోయారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ( CS Jawahar Reddy ) డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను( DGP Harish Kumar Gupta ) ప్రశ్నించడం జరిగింది.అల్లర్లకు బాధ్యులు ఎవరో చెప్పాలని నిలదీసింది.
ఇదే సమయంలో హింసాత్మక ఘటనాలపై సీట్ ( SIT ) వేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు.
ఏడిజి స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియమించటం జరిగింది.
సిట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదించినట్లు తెలుస్తోంది.రేపటిలోగా పూర్తి నివేదికను అందించబోతున్నట్లు తర్వాత కీలక నేతలను అరెస్టు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.సిట్ నివేదిక వచ్చాక… హింసాత్మక ఘటనలకు కొందరు అభ్యర్థులకు కొమ్ము కాసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందట.
ఇదిలా ఉంటే కౌంటింగ్ తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని ఏపీలో 25 కంపెనీల కేంద్ర బలగాలు కొనసాగించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.ఎన్నికల ఫలితాల( Elections Result ) అనంతరం హింస చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు ఇప్పటినుండే తీసుకుంటూ ఉంది.
ఈ మేరకు ఏపీకి అదనపు కేంద్ర బలగాలు పంపించాలని కేంద్ర హోం శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.