మొన్న పవిత్ర జయరాం నిన్న చందు.. త్రినయని నటుడి మృతి వెనుక కారణాలివేనా?

తాజాగా తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరొక విషాదం చోటుచేసుకుంది.ఇటీవల జీ తెలుగు( Zee Telugu )లో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్( Trinayani ) లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్ర జయరాం ( Pavithra Jayaram )మృతి చెందిన విషయం తెలిసిందే.

 Serial-artist-chandu-suicide, Chandu ,serial Actor , Chandrakanth , Suicide, Tol-TeluguStop.com

ఆమె మృతితో ఒకసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఆమె మరణ వార్తను అభిమానులు అటు తోటి నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ బాధ నుంచి ఇంకా బయటపడక ముందే వారికి ఊహించని షాక్ తగిలింది.

నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు( Serial Actor Chandrakanth ) తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో అతని మరణ వార్త తెలుసుకున్న అభిమానులు తోటి నటీనటులు షాక్ కు గురయ్యారు.అయితే కేవలం రోజుల వ్యవదిలోనే ఇద్దరు చనిపోవడంతో ఈ విషయంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే ఈ రెండు మరణాలకు ఓ కనెక్షన్ ఉందని చెప్పాలి.పవిత్ర జయరాం, చందు చాన్నాళ్లుగా కలిసి సీరియల్స్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఉన్నట్టు తెలుస్తోంది.తనకు ఎంతో ఇష్టమైన, తను ప్రేమిస్తున్న పవిత్ర చనిపోవడంతో చందు తట్టుకోలేకపోయాడు.

ప్రతి రోజూ పవిత్రను తలుచుకుంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.

ఆమె మరణించిందనే విషయాన్ని అంగీకరించలేదు.రోజూ పెడుతున్నట్టే, పవిత్ర చనిపోయిన తర్వాత కూడా ఆమెపై ఇనస్టా పోస్టులు పెట్టాడు.పవిత్ర లేకుండా తను బతకలేనంటూ ప్రకటించిన అతడు, నిన్న‌ హైదరాబాద్ మణికొండలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు.

చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.చందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు, ఆత్మహత్యపై ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube