టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి( Shilpa Ravichandra kishore Reddy )కి మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.అయితే ఒకవైపు మెగా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా అల్లు అర్జున్ మాత్రం వ్యతిరేక పార్టీకి సపోర్ట్ చేయడంతో పాటు, ప్రచారంలో పాల్గొనడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఇకపోతే నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా వార్తలు నడిచాయి.
అయితే ఇలాంటి సమయంలో ఒకే వేదికపై చిరంజీవి అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.దాసరి నారాయణరావు జయంతి( Dasari Narayana Rao Jayanthi ) సందర్భంగా మే 4వ తేదీని డైరెక్టర్స్ డే గా జరుపుకుంటారు.ఈ ఏడాది డైరెక్టర్స్ డే ని భారీగా నిర్వహించాలని దర్శకుల సంఘం భావించగా.
ఎన్నికల కోడ్ కారణంగా మే 4న పర్మిషన్ రాలేదు.ఇప్పుడు ఈ ఈవెంట్ ను మే 19న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో పాటు దర్శకులు అందరూ హాజరు కానున్నారు.
అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. మెగా వర్సెస్ అల్లు అంటూ అభిమానుల మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో ఒక వేదికపై చిరంజీవి, బన్నీ కలవనుండటం ఆసక్తి కలిగిస్తోంది.అలాగే ఈ వేదికపై ఎన్నికల ప్రచారం వివాదానికి ముగింపు పలుకుతారేమో చూడాలి మరి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వాళ్లు వాళ్లు ఎప్పటికైనా ఒకటి అవుతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.