త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. భార్య బయటపెట్టిన షాకింగ్ నిజాలు ఇవే!

ఈ మధ్య కాలంలో బుల్లితెర నటుల మరణాలు అభిమానులను ఒకింత షాక్ కు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.త్రినయని( Trinayani ) సీరియల్ ఫేమ్ చందు ఆత్మహత్య చేసుకోవడం బుల్లితెర అభిమానులకు భారీ షాకిచ్చింది.

 Trinayani Fame Chandu Death Details Here Goes Viral In Social Media ,social M-TeluguStop.com

నటుడు చందు ఆత్మహత్య విషయంలో అతని భార్య షాకింగ్ విషయాలను బయటపెట్టారు.చందు భార్య శిల్ప మాట్లాడుతూ స్కూల్ వయస్సులోనే నా వెంట పడిన చందు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు.

Telugu Chandrakanth, Chandu, Trinayani, Shilpa, Zee Telugu-Movie

మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు.నేను చందు( Chandrakanth )కి సీరియల్ లో మొదట ఛాన్స్ ఇప్పించానని శిల్ప పేర్కొన్నారు.ఆ తర్వాత చందుకు వరుసగా సీరియల్ ఆఫర్స్ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.త్రినయని సీరియల్ చేస్తున్న సమయంలో పవిత్రతో చందు రిలేషన్ మొదలైందని శిల్ప కామెంట్లు చేశారు.

పవిత్ర మోజులో పడి చందు నన్ను, పిల్లలను వదిలేశాడని ఆమె పేర్కొన్నారు.

Telugu Chandrakanth, Chandu, Trinayani, Shilpa, Zee Telugu-Movie

చందు పవిత్ర( Pavithra Jayaram ) మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నారని శిల్ప అన్నారు.ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడని మాకు మా పిల్లలకు న్యాయం జరగాలని శిల్ప వెల్లడించారు.చందు మరణంతో ఆయన నటిస్తున్న సీరియల్స్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వరుసగా టీవీ ప్రముఖులు మరణిస్తుండటం సీరియల్ అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.పోలీసుల దర్యాప్తులో చందు మరణానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

సినిమా హీరోలకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో సీరియల్ నటులకు సైతం అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.చందు మరణ వార్త విని అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారని సమాచారం అందుతోంది.

చందు మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని సమాచారం అందుతోంది.ఈ మరణాలు ఇక్కడితో ఆగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube