తక్కువ బరువుతో స‌త‌మ‌తం అవుతున్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

అధిక బరువుతో బాధపడే వారే కాదు తక్కువ బరువుతో సతమతమవుతున్న వారు కూడా ఎంతో మంది ఉంటారు.అధిక బరువు ఎంత ప్రమాదకరమో తక్కువ బరువును కలిగి ఉండటం కూడా అంతే ప్రమాదకరం.

 This Wonderful Smoothie Will Help To Gain Weight! Smoothie, Healthy Smoothie, Ba-TeluguStop.com

అయితే బరువు తగ్గడానికే కాకుండా పెరగడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి.కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది విషయం ఏంటంటే బరువు పెరగడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా పెరగడం కూడా అంతే ముఖ్యం.

కొంద‌రు వెయిట్ గెయిన్ అవ్వ‌డం కోసం ఏది పడితే అది తినేస్తుంటారు.ఫలితంగా జబ్బుల బారిన పడుతుంటారు.

Telugu Bananaalmond, Tips, Latest, Smoothie-Telugu Health

అందుకే హెల్తీ డైట్ ద్వారా వెయిట్ గెయిన్( Weight gain ) అయ్యేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా బాగా స‌హాయపడుతుంది.తక్కువ బరువుతో బాధపడుతున్న వారు తమ డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే అదిరిపోయే ప్రయోజనాలను పొందుతారు.మ‌రి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bananaalmond, Tips, Latest, Smoothie-Telugu Health

ముందుగా ఒక బౌల్ లో రెండు వాల్ నట్స్ వేసుకొని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటి పండును స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.అలాగే నాన‌బెట్టుకున్న వాల్ నట్స్, రెండు టేబుల్ స్పూన్లు వేయించి గింజ తొలగించిన వేరుశనగలు( Peanuts ), ఒక కప్పు పెరుగు, ఒక గ్లాసు ఇంట్లో తయారు చేసుకున్న బాదం పాలు మరియు మూడు నుంచి నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో మన స్మూతీ అనేది సిద్ధమవుతుంది.

బనానా ఆల్మండ్ స్మూతీ ( Banana almond smoothie )రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా బరువు పెరగాలనుకునే వారికి ఇది బెస్ట్ స్మూతీ అని చెప్పుకోవచ్చు.

నిత్యం ఈ స్మూతీని తీసుకుంటే శరీరంలో కేలరీలు చక్కగా పెరుగుతాయి.దాంతో వెయిట్ గెయిన్‌ అవుతారు.

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ గా మారుతుంది.జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

నీరసం, అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.బలమైన ఎముకలు కండరాల నిర్మాణానికి కూడా ఈ స్మూతీ సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube