కల్కి మూవీలో కృష్ణుడి పాత్రను పోషించింది ఇతనే.. ఆ తమిళ నటుడికి ఛాన్స్ దక్కిందా?

నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి.ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 This Tamil Actor Was Played Krishna Role In Kalki 2898 Ad, Kalki 2898 Ad, Tolly-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజే కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది.అంతేకాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కల్కి సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.ఊహించని ట్విస్ట్ విజువల్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.

Telugu Kalki Ad, Krishna Role, Prabhas, Tamilplayed, Tollywood-Movie

ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం( Brahmaratham ) పట్టారు.ఇకపోతే ఈ సినిమాలు చాలామంది స్టార్ సెలబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఇందులో కృష్ణుడి పాత్రలో నటించిన వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.కురుక్షేత్రం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించకపోవడమే ఇందుకు కారణం.

ఆ క్యారెక్టర్‌ పోషించిన వ్యక్తి నడక తీరును పరిశీలించి కొందరు హీరో నాని ( Hero Nani )అని అభిప్రాయం వ్యక్తం చేశారు.మరికొందరు ఇతర హీరోల పేర్లు ప్రస్తావించారు.

Telugu Kalki Ad, Krishna Role, Prabhas, Tamilplayed, Tollywood-Movie

సంబంధిత పోస్ట్‌లపై స్వయంగా ఆ క్యారెక్టర్‌ ప్లే చేసిన నటుడే సోషల్‌ మీడియా వేదికగా స్పందించడంతో సమాధానం లభించినట్టైంది.ఆయనే తమిళ నటుడు కృష్ణ కుమార్‌.ఆకాశం నీ హద్దురా సినిమాతో పలకరించారు.సూర్య హీరోగా రూపొందిన ఈ మూవీలో ఆయనకు స్నేహితుడిగా నటించారు కేకే.ధనుష్‌ ( Kk Dhanush )మారన్‌ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు.తరువాత కాదళగి సినిమాతో 2010లో తెరంగేట్రం చేసిన ఆయనకు కల్కి ఐదో సినిమా అని చెప్పాలి.

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ అర్జునుడిగా నటించి, ఆకట్టుకున్నారు.దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ, అనుదీప్‌ కేవీ, నటులు దుల్కర్‌ సల్మాన్‌, ఫరియా అబ్దుల్లా తదితరులు ఇతర అతిథి పాత్రల్లో సందడి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube