తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ).కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈయన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇలా తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అపజయం లేకుండా ఈయన చేసిన సినిమాలతో విజయం అందుకోవడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను కూడా తీసుకువచ్చారు.ఇండస్ట్రీలో అపజయమే ఎరుగని ఈయన ఓ సినిమా విషయంలో ఎంతో కంగారు పడుతూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.
ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన కల్కి సినిమా( Kalki Movie ) ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్ గత సినిమాలకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.ఇక ప్రభాస్ నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే రాజమౌళి కారణమని చెప్పాలి.ఈయన బాహుబలి ( Bahubali ) సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతోనే ప్రభాస్ కి నేడు ఈ స్థాయిలో క్రేజ్ లభించింది.
అయితే బాహుబలి సినిమా మొదటి భాగం విడుదల సమయంలో రాజమౌళి ఎంతో కంగారు పడ్డారట ఆ కంగారులో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఓ సందర్భంలో తెలిపారు.
అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ మొదటిసారి రాజమౌళి ఈ సాహసం చేశారు.సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది.పైగా ఉత్తరాది నటీనటులు ఎవరు కూడా లేకపోవడంతో అక్కడ ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే కంగారు ఉండేదట.
ఈ సినిమా విడుదలైన తర్వాత నార్త్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ లభించిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఈయన కంగారు పడ్డారట.ఆ కంగారులో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు కానీ మెల్లిమెల్లిగా ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకోవడంతో నిర్మాతలు కూడా సేఫ్ అవ్వడమే కాకుండా పార్ట్ 2 కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అన్న ట్విస్ట్ పార్ట్ 2 పై కూడా అంచనాలను పెంచిందని ఓ సందర్భంలో రాజమౌళి తెలిపారు.