ఓవర్సీస్ లో కల్కి ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుందిగా!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి( Kalki ).ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

 Kalki Is Now The All Time Highest Grossing Indian Film In North America, Prabhas-TeluguStop.com

నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.

విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న కల్కి విడుదల తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది.

Telugu America, Kalki, Kalkitime, Prabhas-Movie

తాజాగా విడుదల అయిన ఈ మూవీ నార్త్‌ అమెరికాలో ఆల్‌ టైమ్‌ రికార్డును నమోదు చేసింది.నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌( Hollywood ) రేంజ్‌లో రూపొందించారు.దీంతో అక్కడి ప్రేక్షకులనూ ఈ సినిమా మెప్పిస్తోంది.

నార్త్‌ అమెరికాలో ప్రీ సేల్‌ బుకింగ్స్‌ లోనే పలు సినిమాల రికార్డులను బ్రేక్‌ చేసిన కల్కి రిలీజ్‌ తర్వాత అన్నిటిని దాటి టాప్‌లో నిలిచింది.ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌ లోనే 3.8 మిలియన్‌ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది.

Telugu America, Kalki, Kalkitime, Prabhas-Movie

ప్రీమియర్స్‌లోనే ఆర్‌ఆర్‌ఆర్‌( RRR ) కలెక్షన్స్‌ క్రాస్‌ చేయడం విశేషం.ఈ సినిమా తర్వాత స్థానాల్లో ఆర్‌ఆర్ఆర్‌ 3.46మిలియన్లు, కాగా సలార్‌ 2.6m, బాహుబలి2 2.45M గానిలిచాయి.ప్రీమియర్స్‌, మొదటిరోజు కలెక్షన్స్‌ కలిపి అమెరికాలో కల్కి 5 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు క్యూ లు కడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube