వైరల్ వీడియో: భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన రోహిత్.. ఫైనల్లో టీమిండియా..

2024 టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో గురువారం నాడు రాత్రి జరిగిన మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్( England ) పై టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అయితే ఎప్పుడు నవ్వుతూ అందరిని ఆట పట్టిస్తూ సరదాగా కనిపించే రోహిత్ శర్మ మరోసారి తీవ్రమైన భావోద్వారానికి లోనయ్యాడు.

 Viral Video: Rohit Couldn't Stop His Emotions.. Team India In The Final, Ind Vs-TeluguStop.com

ఫైనల్స్ కు చేరామన్న సంతోషంలో రోహిత్ తన ఆనంద భాష్పాలు ఆపుకొనే ప్రయత్నం చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.చేతిని అడ్డుపెట్టుకొని తన భావోద్వేగాన్ని కవర్ చేశాడు.

ఇక అదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను చూసి అతని భుజాన్ని తట్టాడు.ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుపై 68 పరుగుల భారీ తేడాతో గెలిచి మూడోసారి టి20 ప్రపంచ కప్ టోర్నీలలో ఫైనల్స్ కు చేరింది.ఈ మ్యాచ్ మొదట వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో కాస్త ఆలస్యంగా మొదలైంది.ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ 39 బంతులలో 57, సూర్య కుమార్ యాదవ్ 36 బంతులలో 47, హార్థిక్ పాండ్యా 13 బంతులలో 23 కలిసికట్టుగా బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేయగలిగింది.

కోహ్లీ 9, దుబే డక్ అవుట్ లతో మరోసారి విఫలమయ్యారు.వీరితోపాటు ఈసారి రిషబ్ పంత్ కూడా 4 పరుగులతో నిరాశపరిచాడు.

ఇక 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదటిలో దూకుడుగా తన ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.అయితే నాలుగో ఓవర్లో బంతిని అందుకున్న అక్షర పటేల్( Axar Patel ) తన మొదటి బంతికే ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ కెప్టన్ జాస్ బట్లర్ ను పెవిలియన్ పంపించడంతో ఇంగ్లాండ్ పతనం మొదలైంది.ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో జోస్ బట్లర్ 23, హారీ బ్రేక్ 25, జూఫ్రా ఆర్చర్ 21 , లివింగ్ స్టోన్ 11 పరుగులు చేసి 16.4 ఓవర్లలో కేవలం 103 పరుగులకు ఆల్ అవుట్ అయింది.జూన్ 29న ఫైనల్ లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా తో తలబడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube