వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, మనీష్ శర్మ, లీనా నాయర్ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.మరి వీరందరిలో అత్యధిక వేతనం పొందేది ఎవరనేది తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపుతూ ఉంటారు.
చాలా మంది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు( Sundar Pichai ,Satya Nadella ) అందరికంటే ఎక్కువ వేతనం వస్తుందని భావిస్తుంటారు.కానీ అది నిజం కాదని నిరూపిస్తున్నాయి గణాంకాలు.
అమెరికాలోని భారత సంతతి సీఈవోలు అందరిలోకెల్లా నికేశ్ అరోరా ఎక్కువ వేతనం పొందుతున్నారట.
అమెరికా( America )లో అత్యధిక వేతనం పొందుతున్న టాప్ – 10 సీఈవోల లిస్టులో ఒక్క నికేశ్ అరోరా మాత్రమే స్థానం సంపాదించడం కార్పోరేట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. సి సూట్ కాంప్ నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోల జాబితాలో ‘‘పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ’’ సీఈవోగా వ్యవహరిస్తున్న నికేశ్ అరోరా( Nikesh arora ) 10వ స్థానంలో ఉన్నారు.ఈ రెమ్యూనరేషన్ 2023లో సెటిల్ చేయబడినట్లుగా నివేదిక చెబుతోంది.
151.4 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.1263 కోట్లు) సంపాదనతో 2023లో మంజూరైన మొత్తం ద్వారా అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచారు.మరో లిస్టులో రూ.266.4 మిలియన్ డాలర్ల వార్షిక పరిహారంతో 2023లో వాస్తవ చెల్లింపుల్లో అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోలలో 10వ స్థానంలో నిలిచారు నికేశ్.ఈ జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు.ఆయన 2023లో 1.4 బిలియన్లను సంపాదించాడు.మరో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాలంటిర్ టెక్నాలజీస్‌కు చెందిన అలెగ్జాండర్ కార్ప్( Alexander Karp ) 1.1 బిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచాడు.నికేశ్ అరోరా 2018లో పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
అంతకుముందు గూగుల్, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్స్‌లో ఆయన పనిచేశారు.ఎయిర్‌ఫోర్స్ అధికారి కుమారుడైన నికేశ్.
ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు.నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, బోస్టన్ కాలేజీ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు.