రేవ్ పార్టీ ఇష్యూ తరువాత మొదటిసారి తిరుమల వచ్చిన హేమ.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నారు నటి హేమ ( Hema ) ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించిన హేమ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.గత కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీ( Rave Party ) లో ఈమె పాల్గొన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

 Actress Hema Visit Tirumal After Rave Party Issue, Hema, Tirumala Srivaru, Rave-TeluguStop.com

ఇక ఈమెకు పరీక్షలు నిర్వహించగా పరీక్షలలో కూడా పాజిటివ్ రావడంతో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు.

ఇలా ఈ డ్రగ్స్( Drugs ) వ్యవహారంలో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపినప్పటికీ ఈమె విచారణకు హాజరు కావడంతో స్వయంగా బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి ఈమెను అరెస్టు చేశారు.ఇలా హేమ అరెస్ట్ అనంతరం కొద్దిరోజుల పాటు రిమాండ్ లో కూడా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు.ఇలా బయటకు వచ్చిన ఈమె మొదటిసారి తిరుమల శ్రీవారిని ( Tirumala Srivaru ) దర్శించుకున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఈమె బయటకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈమెను చుట్టుముట్టి తనతో సెల్ఫీలు తీసుకున్నారు అనంతరం మీడియా వారు కూడా హేమతో మాట్లాడే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా హేమ మీడియా వారితో మాట్లాడుతూ స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు.ఇక తాను ఇక్కడే పుట్టిన సంగతి మీకు తెలిసిందే అందుకే తిరుమల వచ్చిన ప్రతిసారి నేను నా పుట్టిల్లు కు వచ్చినంత సంతోషం కలుగుతుందని తెలిపారు.

ఇక డ్రగ్స్ కేసు గురించి మీడియా వారు ప్రశ్నించగా నాకేం తెలియదు మీరే వార్తలు రాస్తుంటారు మీకే తెలియాలి కదా అంటూ ఈమె కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube