రేవ్ పార్టీ ఇష్యూ తరువాత మొదటిసారి తిరుమల వచ్చిన హేమ.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నారు నటి హేమ ( Hema ) ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించిన హేమ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.

గత కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీ( Rave Party ) లో ఈమె పాల్గొన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఇక ఈమెకు పరీక్షలు నిర్వహించగా పరీక్షలలో కూడా పాజిటివ్ రావడంతో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు.

"""/" / ఇలా ఈ డ్రగ్స్( Drugs ) వ్యవహారంలో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపినప్పటికీ ఈమె విచారణకు హాజరు కావడంతో స్వయంగా బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి ఈమెను అరెస్టు చేశారు.

ఇలా హేమ అరెస్ట్ అనంతరం కొద్దిరోజుల పాటు రిమాండ్ లో కూడా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఇలా బయటకు వచ్చిన ఈమె మొదటిసారి తిరుమల శ్రీవారిని ( Tirumala Srivaru ) దర్శించుకున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / ఇలా స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఈమె బయటకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈమెను చుట్టుముట్టి తనతో సెల్ఫీలు తీసుకున్నారు అనంతరం మీడియా వారు కూడా హేమతో మాట్లాడే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా హేమ మీడియా వారితో మాట్లాడుతూ స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు.

ఇక తాను ఇక్కడే పుట్టిన సంగతి మీకు తెలిసిందే అందుకే తిరుమల వచ్చిన ప్రతిసారి నేను నా పుట్టిల్లు కు వచ్చినంత సంతోషం కలుగుతుందని తెలిపారు.

ఇక డ్రగ్స్ కేసు గురించి మీడియా వారు ప్రశ్నించగా నాకేం తెలియదు మీరే వార్తలు రాస్తుంటారు మీకే తెలియాలి కదా అంటూ ఈమె కామెంట్లు చేయడం గమనార్హం.

మల్టీప్లెక్స్ లో 1200, సింగిల్ స్క్రీన్ లో 1000.. హీరోల ఫ్యాన్స్ ను నిలువునా దోచేస్తున్నారా?