వైరల్ వీడియో: వీలైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను.. ఆనంద్ మహీంద్రా..

భారతదేశ వ్యాపారం దిగ్గజాలలో ఒకరైన ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం మాత్రమే కాకుండా.

 Viral Video: I Want To Stay There Forever If Possible Anand Mahindra Permanent-TeluguStop.com

, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండడం చూస్తూనే ఉంటాం.ఏదైనా కొత్తగా కానీ.

ఆశ్చర్యపరిచే విధంగా గానీ.మరేదైనా విషయం సంబంధించి ఎవరైనా మంచి పని చేసినా కానీ.

లాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకొని కొన్నిసార్లు అర్హులైన వారికి బహుమతులు కూడా అందజేయడం మనం చూసే ఉంటాము.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ వీడియోని షేర్ చేయడం జరిగింది.

వీడియోను షేర్ చేస్తూ తనకు వీలైతే శాశ్వతంగా అలాంటి చోటే ఉండిపోవాలనుకుంటున్నాను అన్నట్లుగా క్యాప్షన్ జత చేశారు.అయితే ఆ వీడియో సంగతి ఏంటో ఒకసారి చూస్తే.

వర్షంలో ఒక కారుని మంచి నివాస ప్రాంతంగా మార్చడం ఆ వీడియోలో కనబడుతుంది.బయట వర్షం పడుతున్న సమయంలో ఓ మహిళ తన కారు వెనక డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక టెంట్ మాదిరిగా ఏర్పాటు చేయడం., ఆ తర్వాత కారులోని సీట్లను కిందికి దించి మంచి బెడ్ లాగా అదిరిపోయే సెటప్ ఏర్పాటు చేసుకోవడం., అలా కారు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టెంట్ లో ఒక చిన్న టేబుల్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్రదేశంగా దానిని రూపొందించింది.

అంతేకాదు ఆ టెంట్ బయట మరో చిన్న టెంటు వేసి అక్కడ స్నానం చేయడానికి వీలుగా కూడా ఏర్పాటు చేసుకోవడం లాంటివి వీడియోలో గమనించవచ్చు.

ఈ వీడియోను ఆయన తాజాగా షేర్ చేస్తూ ఇది క్యాంపింగ్.నేను ఇక్కడే స్యాస్వతంగా ఉండిపోవాలనుకుంటున్నా అని ఆయన పేర్కొన్నారు.ప్రకృతిలో ఇలాంటి ఆనందం అద్భుతంగా ఉంటుందని.

, అది ఆనందించే వాళ్లే అనుభవం పొందుతారని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా( Social media ) ద్వారా ఆ వీడియో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube