నటి ఉర్ఫి జావేద్ ( Uorfi Javed )తన వింత డ్రెస్సింగ్ స్టైల్‌తో భారతదేశ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే.ఈమె సంచి డ్రెస్సు వేసుకుని వచ్చేస్తే, మరికొన్ని సార్లు చిన్న ముక్కల డ్రెస్సు వేసుకుంటుంది.
ఉర్ఫి డ్రెస్సింగ్ స్టైల్‌ని చాలా మంది ట్రోల్ చేస్తారు కానీ, కొంత మందికి ఆమె ఇన్‌స్పిరేషన్ నిస్తుంది.ఇవాళ మనం అలాంటి వీడియో గురించే మాట్లాడుకుందాం.
ఇటీవల ఇద్దరు యువకులు చాలా వింత దుస్తులు వేసుకుని నెట్‌లో వైరల్ అయ్యారు.వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ చూసి చాలా మంది నవ్వుకున్నారు.
ఆ వీడియోలో ఇద్దరు యంగ్‌స్టర్స్ అండర్‌వేర్‌ని టీ షర్ట్‌లా వేసుకున్నారు.అంతేకాకుండా, తెల్ల గుడ్డ చుట్టుకుని, కింద జీన్స్ ( Jeans ) ప్యాంటు వేసుకున్నారు.కళ్ల అద్దాలు పెట్టుకుని, మార్కెట్‌లో కాన్ఫిడెంట్ గా నడుస్తున్నారు.వాళ్లు మోడల్స్ లాగా పోజులిచ్చి నడుస్తుంటే, చుట్టుపక్కల వాళ్లు నవ్వుతున్నారు.కొందరు అమ్మాయిలు కూడా వాళ్ల సొంత డిజైన్ డ్రెస్సులు చూసి విరగబడి నవ్వేశారు.
ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.ఇలాంటి వింత డ్రెస్సులు వేసుకుని, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు చేయడం ఆ యూజర్‌కి హ్యాబిట్ అట.ఇప్పటి వరకు వాళ్లు పోస్ట్ చేసిన వీడియోలతో పోలిస్తే, ఈ వీడియోకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.వీడియోలో ఉన్న ఆ ఇద్దరికి నెటిజన్లు చాలా ట్రోల్ చేశారుఆ వీడియోకి 8.4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.24 వేలకు పైగా లైకులు వచ్చాయి.వేలాది మంది యూజర్లు ఆ వీడియోపై కామెంట్లు కూడా పెట్టారు.ఓ యూజర్ “ఇలాంటి డ్రెస్సులు వేసుకుని బయటకు వచ్చే ధైర్యం అంటే మాటలు కాదు” అని కామెంట్ చేశాడు.
ఇంకొక యూజర్ “ఈ యువకులు నటి ఉర్ఫి జావేద్‌కు తగ్గేదేలా ఉన్నారని” అని రాశాడు.కొంత మంది యూజర్లు ఆ వీడియో చూసి నవ్వుతున్నట్లుగా ఎమోజీలు పెట్టారు.