ఈ మధ్య సినిమా నిర్మాణంలో డబ్బులు ఖర్చు చేయడం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు నిర్మాతలు.ఎక్కడా వెనుకాడకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.
స్టార్ హీరోల మీద పెడుతున్న డబ్బు రెండు మూడు వారాల్లోనే వస్తుందని ఆశ పడుతున్నారు.కొన్నిసార్లు వారి అంచనాలు తప్పుతున్నాయి.
లాభాల మాట అటుంచి.అసలు పెట్టిన పెట్టుబడే రాని పరిస్థితులున్నాయి.
స్టార్ హీరోల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసి.ఘోరంగా నష్టపోయిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
సాహో:
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నిర్మించిన భారీ చిత్రం సాహో. ఈ సినిమాకకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.
కేవలం 230 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ సినిమాకు దాదాపు 70 కోట్ల మేర నష్టం వచ్చింది.
అజ్ఞాత వాసి:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత వచ్చిన చిత్రం అజ్ఞాత వాసి.కథ సరిగా లేని కారణంగా ఈసినిమా ఫ్లాప్ అయ్యింది.నిర్మాతకు 68 కోట్ల నష్టం మిగిలింది.
స్పైడర్:
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సినిమా స్పైడర్.ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.భారీగా ఖర్చు చేసిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతలపై దాదాపు 60 కోట్ల భారం పడింది.
బ్రహ్మోత్సవం:
బోరింగ్ కథ, కొత్తదనం లేని కథనం మూలంగా ఈ సినిమా అంతగా ఆడలేదు.శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుతో తీసిన ఈ సినిమా మూలంగా నిర్మాతలకు 54 కోట్ల నష్టం వచ్చింది.
సర్దార్ గబ్బర్ సింగ్:
మంచి విజయాన్ని అందుకున్న గబ్బర్ సింగ్ మూవీకి ఇది సీక్వెల్ మూవీ.ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.ఈ సినిమా 45 కోట్ల రూపాయల లాస్ మిగిల్చింది.
నేనొక్కడినే:
సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా భారీ నష్టాన్ని కలిగించింది.ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న నిర్మాతలకు దాదాపు 40 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
ఆరెంజ్ :
బొమ్మరిల్లు భాస్కర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా సరైన విజయాన్ని సాధించలేదు.ఈ చిత్రం దాదాపు 25 కోట్ల మేర నష్టాన్ని కలిగించింది.
వరుడు :
గుణ శేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా వరుడు.ఈ సినిమా కూడా దాదాపు 20 కోట్లకు పైనే నష్టపోయింది.
శక్తి:
మెహర్ రమేష్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా 23 కోట్ల నష్టం కలిగించిందట.
పరమవీర చక్ర :
దాసరి 150 వ చిత్రంగా బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం ఇది.బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఘోర పరాభవం పొందింది.ఈ సినిమా 20 కోట్ల రూపాయల నష్టం కలిగించింది.