నోటి పూతతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. యాలకులతో ఇలా చెక్ పెట్టండి!

నోటి పూత.దీనినే మౌత్ ఆన్సర్ అని పిలుస్తారు.

 How To Get Rid Of Mouth Ulcers With Cardamom! Cardamom, Cardamom Benefits, Carda-TeluguStop.com

పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో నోటి పూత ఒకటి.పోషకాల కొరత, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పెయిన్ కిల్లర్స్ ను తరచూ వాడటం, ఆమ్లా గుణాలు కలిగిన పండ్లు మరియు కూరగాయలను అధికంగా తీసుకోవడం తదితర కారణాల వల్ల నోటి పూత ఏర్పడుతుంది.

చిన్న సమస్యగానే కనిపించినా నోటి పూత వాల్ల‌ ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.తినాలన్నా, తాగాలన్నా చివరికి మాట్లాడాలన్నా తీవ్ర నొప్పి కి లోనవుతారు.

ఈ క్రమంలోనే నోటి పూత తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే నోటి పూతకు చెక్ పెట్టడానికి మన వంటింట్లో ఉండే యాలకులు అద్భుతంగా సహాయపడతాయి.యాలకుల్లో ఉండే పోషకాలు మరియు ఔషధ గుణాలు నోటి పూత త్వరగా తగ్గేందుకు తోడ్పడతాయి.అందుకోసం ఒక గ్లాసు పాలల్లో దంచిన మూడు లేదా నాలుగు యాలకులు వేసి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత పాలను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.

ఇలా ఉదయం లేదా నైట్ కనుక చేస్తే నోటి పూత చాలా వేగంగా తగ్గుతుంది.పైగా యాలకుల పాలను ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.రెగ్యులర్ డైట్ లో యాలకుల పాలను చేర్చుకుంటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

ఎముకలు కండరాలు బలోపేతం అవుతాయి.అలాగే యాలకుల పాలు ఇమ్యూనిటీ పవర్ ( Immunity power )ను పెంచుతాయి.

జలుబు, దగ్గు వంటి సమస్యలను తరిమి కొడతాయి.చాలా మంది తలనొప్పి వచ్చిన సమయంలో పెయిన్ కిల్లర్ ను వేసుకుంటారు.

కానీ అలాంటి సమయంలో ఒక గ్లాస్‌ యాలకుల పాలు తాగితే తల నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.ఒత్తిడి కూడా చిత్తవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube