తెలంగాణలో సాగర్ ఉప ఎన్నిక పోరు ఎంత రసవత్తంగా సాగుతుందో అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు ప్రచారాన్ని కూడా అదే స్దాయిలో నిర్వహించారు.
గులాభి పార్టీ అయితే గెలుపునే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందనే ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన టీఆర్ఎస్ నాయకులు సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
ఈ నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాడుగులపల్లి మండలానికి ఇన్‌చార్జీగా ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, ఆయన అనుచరులు 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొంటూ ప్రతిరోజు దగ్గుతూ, జ్వరంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఇలా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంతో కరోనా వైరస్ మండలం మొత్తం వ్యాపించేలా ఉందని కాబట్టి ఈ విషయంలో ఎన్నికల కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.