Neck Pain Relief Oil : మెడ నొప్పి తీవ్రంగా మదన పెడుతుందా? అయితే ఇలా చెక్ పెట్టండి!

కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చొని పని చేయడం, అధికంగా మొబైల్ ఫోన్‌ను వినియోగించడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మందిని మెడ నొప్పి తీవ్రంగా వేధిస్తుంటుంది.

ఈ మెడ నొప్పి కారణంగా ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.కానీ పెయిన్ కలర్స్ తాత్కాలికంగా మాత్ర‌మే రిలీఫ్ ను అందిస్తాయి.

శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేవు.కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను వాడితే కనుక చాలా సులభంగా మరియు శాశ్వతంగా మెడ నొప్పికి చెక్ పెట్టవచ్చు.

మరి ఇంతకీ మెడనొప్పిని దూరం చేసే ఆ మ్యాజికల్ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు ఉల్లిపాయ తొక్కలు, గుప్పెడు వెల్లుల్లి తొక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత పది నుంచి ప‌న్నెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్ ని తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి, వెల్లుల్లి పొట్టును వేసుకోవాలి.

అలాగే తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ గ్లాస్ జార్‌ను మరుగుతున్న నీటిలో ప‌దిహేను నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.అనంతరం ఆయిల్‌ను పల్చటి వస్త్రం సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన‌ అనంతరం ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకోవాలి.

ఈ ఆయిల్ ను మెడపై అప్లై చేసుకుని కనీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ విధంగా చేస్తే కనుక మెడ నొప్పి అన్నమాట అన‌రు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

శాశ్వతంగా మెడనొప్పి నుండి ఉపశమనాన్ని పొందొచ్చు.

Advertisement

తాజా వార్తలు