టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
కాగా తాజాగా సోషల్ మీడియాలో జూనియర్ న్యూ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోలో ఎన్టీఆర్ సరికొత్త హెయిర్ స్టైల్ లైట్గా గడ్డం కళ్లకు షెడ్స్ ధరించి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.
ఈ ఫొటోను ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ హకీమ్ తారక్‌ను సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేశారు.
ఆయనతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఎన్టీఆర్. కొత్త రోజు, కొత్త వైబ్, ఇక్కడ కూడా మళ్లీ ఆలిమ్ హకీమ్ అని రాసుకొచ్చాడరు.
ఈ ఫొటోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ ఆ ఫోటో పై కామెంట్స్ కురిపిస్తున్నారు.కాగా ఒక కమర్షియల్ యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ ఈ కొత్త లుక్‌లో కనిపించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.తారక్ కొత్త లుక్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.

చూడటానికి అత్యద్భుతంగా ఉన్నారు తారక్ సార్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌లో కొత్త లుక్‌తో పాటు బాద్‌షా సినిమాలో ఎన్టీఆర్ లుక్‌ను కూడా పొందుపరిచారు.అంటే కొత్త లుక్‌ను బాధ్షా లుక్ తో పోల్చరు.బాద్‌షా సి4నిమాకు బండ్ల గణేషే నిర్మాత.బహుశా ఆ లుక్‌ను కంపేర్ చేయడానికి ఇది కూడా కారణం కావచ్చు.బండ్ల గణేష్ ట్వీట్‌పై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ.
ఆయనతో మరో సినిమా చేయమని కోరుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.







