గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ గింజలను తప్పక తీసుకోండి!

ఇటీవల రోజుల్లో గుండె జబ్బుల( Heart diseases ) కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, మద్యపానం ధూమపానం వంటి అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల వయసు పైబడిన వారిలో కాదు వయసులో ఉన్నవారు సైతం గుండె జబ్బులకు గురవుతున్నారు.

 These Seeds Protect You From Heart Diseases! Heart Diseases, Latest News, Health-TeluguStop.com

అందువల్ల ప్రస్తుత రోజుల్లో గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరిగా మారింది.

Telugu Tips, Heart Diseases, Heart, Latest, Pumpkin Seeds, Pumpkinseeds-Telugu H

అయితే గుండె జబ్బులకు చెక్ పెట్టడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.ఈ జాబితాలో గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) కూడా ఒకటి.గుండె జబ్బులకు దూరంగా ఉండాలి అనుకుంటున్న వారు కచ్చితంగా గుమ్మడి గింజలను తినాల్సిందే.

ఎందుకంటే, గుమ్మడి గింజల్లో మెండుగా ఉండే మెగ్నీషియం కంటెంట్ అధిక రక్తపోటును తగ్గించడ‌మే కాకుండా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.అలాగే మెగ్నీషియం చెడు కొలెస్ట్రాల్( Bad cholesterol ) ను మరియు ట్రైగ్లిజరైడ్‌లను క‌రిగిస్తుంది.

గుండె ఆరోగ్యానికి అండంగా నిల‌బడుతుంది.గుమ్మ‌డి గింజ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను వివిధ రుగ్మతల నుంచి సైతం రక్షిస్తాయి.

Telugu Tips, Heart Diseases, Heart, Latest, Pumpkin Seeds, Pumpkinseeds-Telugu H

అంతేకాదండోయ్ గుమ్మ‌డి గింజ‌ల‌ను డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల గ్యాస్ట్రిక్, బ్రెస్ట్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ వ‌చ్చే రిస్క్ తగ్గుతుంది.మ‌ధుమేహం ఉన్న‌వారికి కూడా గుమ్మ‌డి గింజ‌లు వ‌ర‌మ‌నే చెప్పుకోవ‌చ్చు.గుమ్మ‌డి గింజ‌ల్లో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తోడ్ప‌డుతుంది.మధుమేహం నిర్వహణలో గుమ్మడికాయ గింజలు ఉపయోగపడతాయని ప‌లు అధ్య‌య‌నాల్లో నిరూపితం అయింది.ఇక ఇటీవ‌ల రోజుల్లో నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య అంత‌కంతకూ పెరిగిపోతోంది.అయితే అలాంటి వారికి కూడా గుమ్మ‌డి గింజ‌లు ఒక సూప‌ర్ ఫుడ్‌గా చెప్పుకోవ‌చ్చు.

గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రకు మంచిది.నిద్రను ప్రేరేపించడంలో, నిద్ర‌లేమిని దూరం చేయ‌డంలో సహాయపడుతుంది.

కాబ‌ట్టి ఆరోగ్యానికి ఇన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందించే గుమ్మ‌డి గింజ‌ల‌ను ఇక‌పై అస్స‌లు వ‌దిలిపెట్టొద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube