మొదటి తరం దర్శకుల్లో సి.పుల్లయ్యకు( C.Pullaiah ) చాలా మంచి పేరు ఉంది.లవకుశ, సతీసావిత్రి ( Lavakusa, Satisavitri )వంటి పౌరాణిక సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
ఒకానొక సమయంలో ఈ దర్శకుడు “దేవాంతకుడు” పేరిట ఓ సెటైరికల్ మూవీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.విశేషమేంటంటే, తెలుగులో వచ్చిన తొలి సోషియో ఫాంటసీ సినిమా ఇది.మనిషి యమలోకానికి వెళ్తాడనే ఒక కొత్త కాన్సెప్ట్‌ను చూపించారు.పొలిటికల్‌గానూ చాలా సెటైర్స్ పేల్చారు కాబట్టి అప్పటి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
దేవాంతకుడు మూవీ ( Devantakadu movie )భారీ హిట్ అయింది.అందుకే ఇదే తరహాలో మరో సినిమా తీయాలని పుల్లయ్య డిసైడ్ అయ్యారు.“యమగోల” టైటిల్‌తో ఓ సినిమా ప్రకటించారు.కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు.
దీన్ని ఎలాగైనా సెట్స్ పైకి తీసుకువెళ్లాలనుకునే క్రమంలోనే పుల్లయ్య కన్నుమూశారు.తరువాత పుల్లయ్య కుమారుడు సి.ఎస్.రావు యమగోల కథ మరింత డెవలప్ చేయడానికి కష్టపడ్డారు.
ఆపై నిర్మాత డి.ఎన్.రాజుకి యమగోల స్టోరీ ఫైల్‌ని అందజేశారు.
ఆ నిర్మాత ఈ సినిమాకి రచయితగా డి.వి.నరసరాజును సెలెక్ట్ చేసుకోగా.ఆ కథ ఎవ్వరికీ మంచిగా అనిపించలేదు.అందుకే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారు.కొన్నాళ్లకు నిర్మాత డి.రామానాయుడు యమగోల హక్కులను కొని దెబ్బతిన్నారు.ఎందుకంటే టైటిల్ మాత్రమే బాగుంది తప్ప కథలో దమ్ములేదు.అందుకే ఆ స్టోరీని ఓ మూలన పడేశారు.అలా దాదాపు 17 ఏళ్లు యమగోల స్టోరీ అలాగే ఉండిపోయింది.చివరికి మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
మరోవైపు అదే సమయంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.వెంకటరత్నం( Cinematographer S.Venkataratnam ) శోభన్‌బాబుతో “ఈతరం మనిషి” ప్రొడ్యూస్ చేసి నష్టపోయారు.అందుకే ఓ హిట్ కొట్టాలనే పట్టుదలతో ప్రముఖులను కలవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే రచయిత డి.వి.నరసరాజుని కాంటాక్ట్ కాగా అప్పటికే కంప్లీట్ చేసిన యమగోల సినిమా స్టోరీ చెప్పారట.ఈ కథలో హీరో యమలోకానికి పోయినట్లు కలగంటాడు.
అదే పాయింట్‌ని తీసుకొని, దానికి ముందు, వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ అల్లితే సినిమా సూపర్‌హిట్ అవుతుందని నరసరాజు కాన్ఫిడెంట్‌గా కూడా చెప్పారట.వెంకటరత్నం కూడా కన్విన్స్ అయ్యారు.
తర్వాత సంబంధించిన హక్కులన్నీ కొనుగోలు చేశారు.
నరసరాజు సూచనల మేరకు వెంకటరత్నం యమగోల చిత్రంలో బాలకృష్ణను( Balakrishna ) హీరోగా తీసుకోవడానికి రెడీ అయిపోయారు.ఎన్టీఆర్‌ను యమధర్మరాజుగా సెలెక్ట్ చేసుకుందామనుకున్నారు.ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌కి చెప్పారు.
నరసరాజు ఎన్టీఆర్‌కు కథ వినిపించారు.యమధర్మరాజు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చి నానా అవస్థలు పడతారని కథలో భాగంగా చెప్పగా ఎన్టీఆర్ బాగా నవ్వుకున్నారు.
అంతేకాదు ఆ కథను ఇంట్రెస్టింగ్‌గా విన్నారు.స్టోరీ నేరేషన్ అయిపోయాక “హీరో క్యారెక్టర్ బాలకృష్ణ చెయ్యలేడు.
నేను మాత్రమే చెయాల్సినంత కంటెంట్ స్టోరీలో ఉంది.అందుకే నేనే హీరోగా చేస్తా.
యమధర్మరాజుగా సత్యనారాయణను తీసుకుందాం బ్రదర్” అని బదులిచ్చారు.
ఎన్టీఆర్ చెప్పినట్లే చేశారు వెంకటరత్నం.
హీరోయిన్‌గా జయప్రద, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, రుద్రయ్యగా రావుగోపాలరావును సెలెక్ట్ చేసుకున్నారు.యమలోకం సెట్ వేసి యమగోల మూవీ( Yamagola Movie ) షూటింగ్ ప్రారంభించారు.
ఈ సినిమాకి దర్శకుడు తాతినేని రామారావు.ఆయన దీని షూటింగ్‌ను జస్ట్ 27 రోజుల్లో కంప్లీట్ చేశారు.1977 అక్టోబర్ 21న ‘యమగోల’ సినిమా థియేటర్లలోకి వచ్చింది.మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉండటం ఇంట్రెస్టింగ్ గా ఉండటం వల్ల ప్రేక్షకులు దీన్ని చూసేందుకు క్యూ కట్టారు.
కట్ చేస్తే ఇది రెండున్నర కోట్లు కలెక్ట్ చేసే అతిపెద్ద హిట్ అయింది.మొత్తం బాలకృష్ణ కొట్టాల్సిన బ్లాక్ బస్టర్ హిట్ ‘యమగోల’ను ఎన్టీఆర్ లాగేసుకున్నారని చెప్పుకోవచ్చు.