వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మేకప్ అక్కర్లేదు.. న్యాచురల్ బ్యూటీ అయిపోతారు!

అందంగా కనిపించడం కోసం దాదాపు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.అయితే ఇటీవల కాలంలో అందం అంటే మేకప్.

 Try This Magical Pack For Natural Glowing Skin! Magical Pack, Natural Glowing Sk-TeluguStop.com

మేకప్ అంటే అందం అన్న పరిస్థితి వచ్చేసింది.మేకప్ లేకుండా మగువలు కాలు కూడా బయట పెట్టడం లేదు.

అంతలా మేకప్ కు అలవాటు పడిపోయారు.కానీ మేక‌ప్ లేకుండా కూడా అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు.

అందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

Telugu Tips, Skin, Remedy, Natural, Natural Skin, Papaya, Skin Care, Skin Care T

ముఖ్యంగా వారానికి ఒకసారి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ప్యాక్ వేసుకుంటే మేకప్ అక్కర్లేదు.న్యాచురల్ బ్యూటీ అయిపోతారు.మరి ఇంతకీ ఆ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloe Vera Gel ) నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకోవాలి.

చివరిగా రెండు బొప్పాయి పండు( Papaya ) స్లైసెస్ వేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Natural, Natural Skin, Papaya, Skin Care, Skin Care T

ఒకవేళ మీ దగ్గర బొప్పాయి పండు లేదు అనుకుంటే కర్బూజ, అవకాడో, మ్యాంగో వంటి ఫ్రూట్స్ ను బదులుగా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ మరియు డస్ట్ మొత్తం తొలగిపోతుంది.చర్మ రంధ్రాలు లోతుగా శుభ్రం అవుతాయి.

అలాగే ఈ ప్యాక్ ను వేసుకోవడం వ‌ల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.ఆయిలీ స్కిన్ సమస్య దూరం అవుతుంది.

స్కిన్‌ పిగ్మెంటేషన్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది.స్కిన్ టైట్ గా మారుతుంది.

చర్మం తెల్లగా, తాజాగా మ‌రియు కాంతివంతంగా మెరుస్తుంది.మేకప్ లేకపోయినా సహజంగానే బ్యూటిఫుల్ గా కనిపిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube