వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మేకప్ అక్కర్లేదు.. న్యాచురల్ బ్యూటీ అయిపోతారు!

అందంగా కనిపించడం కోసం దాదాపు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.అయితే ఇటీవల కాలంలో అందం అంటే మేకప్.

మేకప్ అంటే అందం అన్న పరిస్థితి వచ్చేసింది.మేకప్ లేకుండా మగువలు కాలు కూడా బయట పెట్టడం లేదు.

అంతలా మేకప్ కు అలవాటు పడిపోయారు.కానీ మేక‌ప్ లేకుండా కూడా అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు.

అందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. """/" / ముఖ్యంగా వారానికి ఒకసారి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ప్యాక్ వేసుకుంటే మేకప్ అక్కర్లేదు.

న్యాచురల్ బ్యూటీ అయిపోతారు.మరి ఇంతకీ ఆ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloe Vera Gel ) నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకోవాలి.

చివరిగా రెండు బొప్పాయి పండు( Papaya ) స్లైసెస్ వేసుకోవాలి. """/" / ఒకవేళ మీ దగ్గర బొప్పాయి పండు లేదు అనుకుంటే కర్బూజ, అవకాడో, మ్యాంగో వంటి ఫ్రూట్స్ ను బదులుగా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ మరియు డస్ట్ మొత్తం తొలగిపోతుంది.

చర్మ రంధ్రాలు లోతుగా శుభ్రం అవుతాయి.అలాగే ఈ ప్యాక్ ను వేసుకోవడం వ‌ల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

ఆయిలీ స్కిన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్‌ పిగ్మెంటేషన్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది.

స్కిన్ టైట్ గా మారుతుంది.చర్మం తెల్లగా, తాజాగా మ‌రియు కాంతివంతంగా మెరుస్తుంది.

మేకప్ లేకపోయినా సహజంగానే బ్యూటిఫుల్ గా కనిపిస్తారు.

మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!