గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉక్రిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు( Harish Rao ) ఈ మధ్యకాలంలో మరింత దూకుడు పెంచుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కూడా హరీష్ రావు స్పీడ్ కు బ్రేకులు వేసి ప్రయత్నం చేస్తోంది.దీనిలో భాగంగానే హరీష్ రావు పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ, ఆయన ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దీనిలో భాగంగానే హరీష్ రావు ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ కీలక నేతలు అనేక విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శల నేపథ్యంలోనే
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీకి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు నోటీసుల హెచ్చరికలు చేశారు.హరీష్ రావుకు ఆనంద్ కన్వెన్షన్ లో వాటాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్( MP Anil Kumar Yadav ) చేసిన ఆరోపణలపై హరీష్ రావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.హిమాయత్ సాగర్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద్ కన్వెన్షన్ లో( Anand Convention ) హరీష్ రావుకు వాటాలు ఉన్నాయని తాజాగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు దీనిపై సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై బురదజల్లే వికృత రాజకీయాలకు తెర లేపినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాలని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారు .గోల్కొండ కోట , చార్మినార్ లో కూడా హరీష్ రావుకు వాటాలు ఉన్నాయని అంటారేమో.అబద్ధపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీసు పంపుతున్నా.
బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ను హెచ్చరిస్తున్నా ‘ అంటూ హరీష్ రావు పోస్ట్ చేశారు.