ఒత్తిడి, తలనొప్పి క్షణాల్లో పరార్ అవ్వాలా.. అయితే ఇది ట్రై చేయండి!

ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరు తలనొప్పి, ఒత్తిడి ( Headache, stress )వంటి సమస్యలకు తరచూ గురవుతుంటారు.వీటి కారణంగా మైండ్ పని చేయడం ఆగిపోతుంది.

 This Drink Helps To Relieve Headache And Stress Quickly! Headache, Stress, Lates-TeluguStop.com

ఏకాగ్రత దెబ్బతింటుంది.అయితే తలనొప్పి అయినా.

ఒత్తిడి అయినా క్షణాల్లో పరార్ అవ్వాలంటే కొన్ని ఇంటి చిట్కాల‌ను ప్రయత్నించాల్సిందే.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే చాలా వేగంగా ఒత్తిడి మరియు తల నొప్పి నుంచి రిలీఫ్ పొందుతారు.

మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా అర అంగుళం అల్లం ముక్కను( ginger ) తీసుకుని పొట్టు తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.

అలాగే అర అంగుళం పచ్చి పసుపు కొమ్మును( Turamaric ) కూడా తురిమి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక ఐదు నుంచి పది ఫ్రెష్ పుదీనా ఆకులు ( Fresh mint leaves )వేసుకోవాలి.మ‌రియు అల్లం తురుము, పసుపు తురుము కూడా వేసుకుని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Headache, Tips, Latest, Stress, Helpsrelieve-Telugu Health

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె( Organic honey ) కలిపితే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.తలనొప్పి, ఒత్తిడి వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ డ్రింక్ ను కనుక తాగితే క్షణాల్లో ఆయా సమస్యలు దూరం అవుతాయి.

Telugu Headache, Tips, Latest, Stress, Helpsrelieve-Telugu Health

ఈ డ్రింక్ ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది.తలనొప్పిని తరిమికొడుతుంది.అలాగే అల్లం, పసుపు, పుదీనాలో స్ట్రెస్ ను తగ్గించే గుణాలు ఉన్నాయి.

అందువల్ల వీటిని పైన చెప్పిన విధంగా తీసుకుంటే ఒత్తిడి దూరం అవుతుంది.మెదడు మరియు మనసు ప్రశాంతంగా మారతాయి.

కాబట్టి తప్పకుండా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube