మీ షాంపూలో ఈ రెండు కలిపి వాడితే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

హెయిర్ ఫాల్.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందికి ఇది కామన్ శత్రువు గా మారింది.

 Using These Two Together In Your Shampoo Will Reduce Hair Fall Details! Hair Fal-TeluguStop.com

అయితే అందరిలోనూ జుట్టు రాలడానికి ఒకే కారణం కనిపించదు.ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది.

కారణం ఏదైనా హెయిర్ ఫాల్ నుంచి బ‌య‌ట ప‌డ‌టం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.తరచూ హెయిర్ ప్యాక్ లు, మాస్కులు వేసుకుంటారు.

ఖ‌రీదైన‌ షాంపు, నూనెలు వాడుతుంటారు.ఎన్ని చేసినా ఒక్కోసారి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు.

దీంతో ఏం చేయాలో అర్థం కాక తీవ్రంగా మదన పడుతూ ఉంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే మీ రెగ్యులర్ షాంపూలో ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు కలిపి యూస్ చేస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అన‌రు.

మ‌రి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె పోయాలి.

ఆయిల్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్‌ పౌడర్‌ను వేసి స్లో ఫ్లేమ్ పై ఐదు నుంచి పది నిమిషాల పాటు హీట్ చేయాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్‌ను పల్చటి వస్త్రం సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

కలోంజి సీడ్స్‌ ఆయిల్ ను ఒక బాటిల్‌లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Shampoo-Telugu Health

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యుల‌ర్‌ షాంపును వెయ్యాలి.అనంతరం అందులో హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న కలోంజి సీడ్స్ ఆయిల్‌ను వేసుకోవాలి.అలాగే అందులో నాలుగు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని యూస్ చేసి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఇలా గనుక చేస్తే కుదుళ్లు బ‌లోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్‌కు అడ్డుకట్ట ప‌డుతుంది.పైగా డ్రై హెయిర్, డామేజ్ హెయిర్ వంటి సమస్యలు సైతం అదుపులోకి వ‌స్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube