స్టార్ డైరెక్టర్ రాజమౌళికి( Star director Rajamouli ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.రాజమౌళితో ఒక్క సినిమా నిర్మిస్తే కోట్ల రూపాయల లాభాలు రావడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
రాజమౌళితో మరో సినిమాను నిర్మించాలని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్( Produced by Ashwinidat ) ఆశ పడుతున్నారు.స్టూడెంట్ నంబర్1 సినిమాకు అశ్వనీదత్ సమర్పకుడిగా వ్యవహరించారు.
స్టూడెంట్ నంబర్1 సినిమాను( Student number 1 movie ) అద్భుతంగా నిర్మించిన అశ్వనీదత్ కోరిక విషయంలో రాజమౌళి ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.రాజమౌళి ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చిన నిర్మాతల ప్రాజెక్ట్ లన్నీ మహేష్ బాబు సినిమాతో పూర్తి కానున్నాయి.
భవిష్యత్తులో సొంతంగా సినిమాలను నిర్మించాలనే ఆలోచన సైతం జక్కన్నకు ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
రాజమౌళి కెరీర్ ప్లాన్స్ ఎవరికీ అంతు చిక్కవని ప్రస్తుత పరిస్థితుల్లో జక్కన్న సినిమాలను నిర్మించాలని భావించడం కూడా సులువైన విషయం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజమౌళి పారితోషికం కూడా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉందనే సంగతి తెలిసిందే.మరో ఐదేళ్ల తర్వాత జక్కన్న పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉందని చెప్పవచ్చు.
జక్కన్న ,అశ్వనీదత్ కాంబో నిజంగా సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.మరోవైపు మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రాలేదనే సంగతి తెలిసిందే.రాజమౌళి ఒక్కో మెట్టు ఎదుగుతూ దర్శకునిగా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా జక్కన్న ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
రాజమౌళి ఒక సినిమా కోసం ఏకంగా ఆరేళ్ల సమయం కేటాయిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.