భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఎన్టీఆర్( Jr ntr ) ముందు వరుసలో ఉంటాడు.ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయగల ఔట్‌స్టాండింగ్ యాక్టర్ తారక్.
ఇందులో నో డౌట్.దేవర సినిమా( Devara movie)లో డ్యూయల్ రోల్స్ లో అద్భుతమైన వేరియేషన్స్ చూపించి తనకంటే గొప్ప హీరో మరొకరు ఉండరని ప్రూవ్ చేశాడు.
తారక్ ఎప్పుడూ కూడా చాలా చాలెంజింగ్ రోల్స్ ఎంచుకున్నాడు.దేవర సినిమాలో అతను చేసిన పాత్రలు కూడా చాలా కష్టమైనవి అని చెప్పుకోవచ్చు.
ఇందులో ఒక పాత్రలో తారక్ టైం లేనివారికి భయం ఏంటో చూపిస్తాడు ఆ క్రమంలో ఉగ్రవాతారాన్ని ప్రదర్శిస్తాడు.మరో పాత్రలో పిరికి వ్యక్తి లాగా కనిపిస్తాడు.
ఈ సినిమా కథ, కథనం అంతగా బాగోలేదు కాబట్టి మిక్స్‌డ్ టాక్ వస్తోంది.అయినా సరే బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.ఈ సినిమాకి కాసుల వర్షమే కురుస్తోంది.ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తుంటే దేవర మూవీ కచ్చితంగా సూపర్ హిట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.ఈ సక్సెస్ కి ప్రధాన కారణం ఇద్దరు ఉన్నారు.వారిలో ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.
( Anirudh Ravichander ) తారక్ అద్భుతంగా యాక్ట్ చేయగా, ఆ యాక్టింగ్ కి తగినట్లు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు అనిరుధ్.తారక్ కనిపించిన ప్రతి సీన్‌కు కూడా ఆకట్టుకునే లాగా మ్యూజిక్ స్కోర్ ఆఫర్ చేశాడు.
దేవర సినిమా చూసిన వారిని ఎవరిని అడిగినా సరే ఈ మూవీకి అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే హైలెట్ అని చెబుతున్నారు.ఎన్టీఆర్ గొప్ప నటుడు, అందులో సందేహం లేదు, కానీ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా సన్నివేశానికి తగినట్లు లొకేషన్స్ కి సూట్ అయ్యేటట్లు అనిరుధ్ సంగీత బాణీలు సమకూర్చాడు.అందుకే ఈ మూవీ సక్సెస్ లో ఎన్టీఆర్ కంటే ఈ యువ మ్యూజిక్ డైరెక్టరే ఎక్కువ పాత్ర పోషించాడని చెప్పుకున్నా తప్పులేదు.పాటలు కూడా చాలా బాగా కంపోజ్ చేశాడు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో అనిరుధ్, తారక్ కాంబోలో ఒక సినిమా రావాలని కోరుకుంటున్నారు.అనిరుధ్ మ్యూజిక్ ఎన్టీఆర్ హీరో జానీ మరో లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు.
సినిమాకి ముందు కూడా అదే జరగాలని ఆశించారు అయితే వారు ఆశించిన దానికంటే మంచిగానే మ్యూజిక్ అందించి వారందరినీ సాటిస్ఫై చేయగలిగాడు అనిరుధ్.