వేరుశనగలను చాలా మంది ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు.చలికాలంలో వీటిని ఎక్కువగా తినడం వల్ల వీటిలో ఉన్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ లాంటి అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.
అంతేకాకుండా వేరుశనగ తినడం వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది.ఇంకా చెప్పాలంటే వేరుశనగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వేరుశనగ తినడం వల్ల ఉన్న ఎన్నో ప్రయోజనాలు ఉన్న కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించే సమస్యలు కూడా ఉన్నాయి.వేరుశనగ తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ రుచిని పెంచడానికి ఉప్పుతో పాటు అనేక రకాల రసాయనాలను కలిపి తయారుచేస్తున్నారు.ఇలాంటి వేరుశనగలను తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరిగే అవకాశం ఉంది.
దీని వల్ల బిపి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.ఈ పరిస్థితిలో అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు వేరుశనగన తినడం అంత మంచిది కాదు.

ఇంకా చెప్పాలంటే కొందరికి వేరుశనగ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది.అందువల్ల వేరుశనగ ను ప్రతి రోజు తింటూ ఉంటారు.వీటిని రోజు తినడం వల్ల వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది.బరువు తగ్గాలని అనుకున్న వారు వేరుశనగ అసలు తినకపోవడమే మంచిది.ఇంకా చెప్పాలంటే ఎసిడిటీ సమస్య ఉన్న వ్యక్తులు వేరుశనగ తినకుండా ఉండడమే ఎంతో మంచిది.వేరుశనగ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం మొదలైన ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల వేరుశనగ జోలికి అసలు పోకపోవడమే మంచిది.లేదంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
లేదు తినకుండా ఉండలేము అనుకునేవారు ఏదో అప్పుడప్పుడు కొన్ని వేరుశనగలను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మంచిది.