ఈ మధ్య కాలంలో ఆడ, మగ, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేదించే సమస్యల్లో అధిక బరువు అనేది ఒకటి.బరువు తగ్గటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు.
చాలా మంది కఠినమైన వ్యాయామం కూడా చేస్తూ ఉంటారు.నెలకు కనీసం 5 కేజీలు బరువు తగ్గేలా వెయిట్ లాస్ రోటి గురించి తెలుసుకుందాం.
మాములుగా అందరూ గోధుమపిండితో రొట్టెలను తయారుచేసుకొని తింటూ ఉంటారు.అయినా పెద్దగా ప్రయోజనం కనపడదు.
గోధుమపిండిలో గ్లూటెన్ అనే జిగురు పదార్ధం ఉంటుంది.ఈ గ్లూటెన్ అనేది అందరికి సరిపడదు.గ్లూటెన్ పడకపోవటం వలన మలబద్దకం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు,మరికొందరిలో మోషన్స్ అవటం జరుగుతూ ఉంటుంది.అందువల్ల ఇప్పుడు చెప్పే రోటీలను తయారుచేసుకొని ప్రతి రోజు తింటే మీరు ఖచ్చితంగా నెలలో 5 కేజీలకు పైగా తగ్గుతారు.
ఒక కప్పు గోధుమపిండి8 స్పూన్ల వైట్ ఓట్స్ఒక స్పూన్ అవిసె గింజలుఒక స్పూన్ తెల్లని నువ్వులు
ఒక బాణలిలో నూనె లేకుండా తెల్లని నువ్వులు , ఓట్స్, అవిసె గింజలు గోల్డ్ కలర్ లోకి వచ్చేవరకు వేగించాలి.వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.ఈ పొడిని గోధుమపిండిలో కలిపి వేడి నీటి సాయంతో చపాతీ పిండిలా కలిపి రోటీలు చేసుకొని నూనె లేకుండా కాల్చుకోవాలి.పూటకు ఒకటి లేదా రెండు రోటీలను తినాలి.
ఇలా రోటీలను తింటూ ప్రతి రోజు 15 నిముషాలు వ్యాయామం చేస్తే నెల రోజుల్లో ఖచ్చితంగా 5 కేజీల బరువు తగ్గుతారు.