థాయ్‌లాండ్( Thailand ) దేశంలో ఒక హార్ట్ బ్రేకింగ్ సంఘటన చోటుచేసుకుంది.ఈ కంట్రీ లోని లంఫూన్( Lampoon ) అనే ప్రాంతంలో ఒక రైతు తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న మొసళ్ళను చంపేశాడు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మరి పోతను ఆ పని చేయాల్సి వచ్చింది.వర్షం కారణంగానే ఆయన పెంచుతున్న మొసళ్లు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఇటీవల అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా అన్ని ప్రాంతాలు నీట మునిగాయి, మొసళ్లు పెంచే ఎన్‌క్లోజర్స్ కూడా దెబ్బతిన్నాయి.ఈ ఎన్‌క్లోజర్స్ కూలిపోతే మొసళ్లు బయటకు వచ్చి ప్రజలపై దాడి చేయడం, ఇతర జంతువులను చంపడం వంటి ప్రమాదం ఉంది.
అందుకే ఆ రైతు మూడు మీటర్ల పొడవు వరకు ఉండే 125 మొసళ్లను చంపాల్సి వచ్చింది.
ఈ విషయం గురించి సీఎన్‌ఎన్ వార్తా సంస్థ ( CNN )శుక్రవారం వార్త ప్రచురించింది.
ఈ వరదల వల్ల ఇరవై మందికి పైగా చనిపోయారు.మొసళ్ల రైతు సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “కంచె విరిగిపోతే ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో నేను ఊహించలేకపోయాను.
అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని చెప్పారు.
ఈ విషయం గురించి ఆ రైతు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కూడా చేశారు.ఆయన పోస్ట్‌లో మొసళ్ల కొలను దగ్గర ఉన్న గోడలు ఎంత దెబ్బతిన్నాయో చూపించారు.“ఈ గోడలు పగిలిపోవడం వల్ల నేను చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.ఆ రోజు నిరంతరం వర్షం పడుతూనే ఉంది.నీటిలో ఉన్న గోడ పగిలిపోయింది.ఇంకొంచెం ఉంటే బయటి గోడ కూడా పగిలిపోయేది” అని ఆ రైతు చెప్పారు.
“వర్షం నిరంతరం పడుతున్నందున మొసళ్ల ( crocodiles )కొలను మరమ్మతు చేయడం చాలా ప్రమాదకరం.అందుకే నాకు మొసళ్ల చంపడం తప్ప మరో మార్గం కనిపించలేదు.ఇది చాలా కష్టమైన నిర్ణయం.
కానీ ఈ పరిస్థితిలో ఇదే సరైన మార్గం.వర్షం పడుతూనే ఉండడంతో ఇదే వేగవంతమైన, సురక్షితమైన మార్గం.
మీ అందరి ప్రోత్సాహం, అవగాహనకు ధన్యవాదాలు” అని ఆయన తన పోస్ట్‌లో రాశారు.